Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

elections: వాళ్లు ఎంత ఇస్తే అంతకంటే రెండింతలు నేను ఇస్తా, ఓటుకు రేట్ ఫిక్స్ చేసిన టాప్ లీడర్!

బెంగళూరు/బెళగావి: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు,. విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ అధికార పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు ఓటు వేసిన వారిని ఇన్ని వేల రూపాయల డబ్బులు ఇస్తానని ఓటుకు రేటు ఫిక్స్ చెయ్యడం కలకలం రేపింది. నా ప్రత్యర్థి మీకు ఇస్తానని చెప్పిన రెండింతల డబ్బులు నేను ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

రేట్ ఫిక్స్ చేసిన టాప్ లీడర్

రేట్ ఫిక్స్ చేసిన టాప్ లీడర్

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తమదైన శైలిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి నాకు ఓటు వేస్తే ఒక్క ఓటుకు అక్షరాల రూ. 6వేలు ఇస్తామని బహిరంగంగానే చెప్పడం కలకలం రేపింది.

లక్ష్మీ మేడమ్ పోటీ

లక్ష్మీ మేడమ్ పోటీ

బెళగావి రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్మీ హెబ్బాల్కర్, గోకాక్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి మధ్య ఎన్నికల పోరు కొనసాగుతోంది. గతంలో లక్ష్మీ హెబ్బాళ్కర్ ను ఎన్నికల్లో ఓడిస్తానని బాహాటంగానే చెప్పిన రమేష్ జారకిహోళి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఒక్క ఓటుకు రూ. 6 వేలు డబ్బు చెల్లిస్తానని బహిరంగంగాచెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

డబ్బు+ గిఫ్ట్

డబ్బు+ గిఫ్ట్

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రత్యర్థి అభ్యర్థి ఓటర్లను ఆకర్షించడానికి మూడు వేల రూపాయలతో పాటు ఖరీదైన బహుమతి ఇస్తామని అంటున్నారు. కానీ మేము బహుమతులు ఇవ్వము. బదులుగా నేను కాంగ్రెస్ నాయకులు ఇచ్చే డబ్బు కంటే రెట్టింపు డబ్బు ఇస్తానని. మీరు నాకు ఓటు వేస్తే, ఓటుకు 6,000 రూపాయలు ఇస్తానని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకి హోళి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

ఖర్మరా బాబు

ఖర్మరా బాబు

డబ్బు ప్రకటనల వెనుక ఎన్నికల ప్రచారానికి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలకు బీజేపీలో తావులేదని జలవనరుల శాఖ మంత్రి గోవింద కారజోల అన్నారు. రమేష్ జారకిహోళి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

బహికంగ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌ను ఓడించాలని రమేష్ జారకిహోళి పందెం వేశారని, దీనికి సంబంధించి కోట్లాది డబ్బు ఖర్చు చేస్తానని అన్నారని ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడు బెళగావిలో జోరుగా ఊపందుకోవడంతో అక్కడి ఓటర్లకు భలే డిమాండ్ మొదలైయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+