Illegal affair: ఓవర్ డ్యూటీ అనుకున్న భర్త, ఓవర్ టైమ్ ఎంజాయ్ చేస్తున్న భార్య, తమ్ముడు!
బెంగళూరు/ హోసూరు/ చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భార్య, ఇద్దరు పిల్లలను పిలుచుకుని భర్త ఐటీ హబ్ కు వచ్చాడు. భార్య ఒక చోట, భర్త మరో చోట ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న చోట సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడితో భార్యకు పరిచయం అయ్యింది. అంతే ఒకేచోట ఉద్యోగం చేస్తున్న ఆంటీతో ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకుని మస్త్ మజా చేశాడు. భార్య ఓవర్ డ్యూటీ చేస్తోందని ఇంతకాలం అనుకున్న భర్త ఆమె ప్రియుడితో ఓవర్ టైమ్ ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్నాడు.
అంతే భార్య చెప్పినమాట వినకపోడంతో ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను ఆమె పుట్టింటికి తరిమేశాడు. ప్రియురాలిని కొత్త ఇంటిలో పెట్టి కాపురం చెయ్యడానికి ప్రియుడు ప్రయత్నించాడు. ఆంటీ తమ్ముడికి అసలు విపయం తెలిసిపోయింది. ఫ్రెండ్స్ ను వెంటపెట్టుకుని వెళ్లిన తమ్ముడు ప్రియుడితో కలిసి పారిపోతున్న అక్కను అడ్డుకున్నాడు. తరువాత కొంత డ్రామా జరిగింది. అక్క ప్రియుడిని చంపేసిన తమ్ముడు అతని ఫ్రెండ్స్ అతని శవాన్ని ఆటోలో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
అర్దరాత్రి డ్యూటీలో ఉన్న ఎస్ఐ దగ్గరకు వెళ్లిన తమ్ముడు అతని ఫ్రెండ్స్ తాగడానికి మంచినీళ్లు అడిగారు. తరువాత సార్ వాడి కథ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడే చంపేశాము, ఆటోలో వాడి డెడ్ బాడీ ఉంది తెచ్చుకోండి అంటూ తీపీగా చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

పెళ్లి చేసిన పెద్దలు
బెంగళూరుకు చెందిన సుధారాణి అనే మహిళను కోలారు జిల్లా మాలూరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. సుధారాణి, రాజేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన తరువాత మాలూరులోనే ఉన్న వెంకటేష్, సుధారాణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరు చేరుకుని సిటీ శివార్లలో వీరు నివాసం ఉంటున్నారు.

భార్య ఉద్యోగం చేస్తున్న ఫ్యాక్టరీలో టచ్ లోకి వచ్చిన కుర్రాడు
బెంగళూరు సమీపంలోని హోసూరు (తమిళనాడు) సమీపంలోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో సుధారాణి ఉద్యోగంలో చేరింది. సుధారాణి భర్త వెంకటేష్ కూడా వేరే కంపెనీలో ఉద్యోగంలో చేశారు. వెంకటేష్, సుధారాణి దంపతులు ఆమె పుట్టింటిలో ఉంటున్నారు. సుధారాణి ఉద్యోగం చేస్తున్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలో భాస్కర్ (24) అనే యువకుడు సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

కుర్రాడితో భార్యకు అక్రమ సంబంధం
సుధారాణి ఉద్యోగం చేస్తున్న చోట సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్న భాస్కర్ కు పరిచయం అయ్యింది. అంతే ఒకేచోట ఉద్యోగం చేస్తున్న సుధారాణి ఆంటీతో సూపర్ వైజర్ భాస్కర్ చనువు పెంచుకున్నాడు. సుధారాణి, భాస్కర్ పరిచయం అక్రమ సంబందానికి దారితీసింది. అక్రమ సంబంధం పెట్టుకున్న సుధారాణి ఆంటీతో భాస్కర్ మస్త్ మజా చేశాడు.

ఓవర్ డ్యూటీ అనుకున్న భర్త...... ఓవర్ ఎంజాయ్ చేసిన భార్య
సుధారాణి రాత్రి లేటుగా ఇంటికి రావడం మొదలు పెట్టింది. ఫ్యాక్టరీలో పని ఉందని, అందుకే లేటు అవుతోందని చాలా కాలం సుధారాణి ఆమె భర్త వెంకటేష్ ను నమ్మించి బయట ప్రియుడు భాస్కర్ రూమ్ కు వెళ్లి అతనితో ఎంజాయ్ చేసింది. చాలాకాలం నుంచి సుధారాణి, భాస్కర్ ఇలా ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. తన భార్య సుధారాణి ఓవర్ డ్యూటీ చేస్తోందని ఇంతకాలం అనుకున్న భర్త ఆమె ప్రియుడితో ఓవర్ టైమ్ ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్నాడు.

భార్యను పుట్టింటికి తరిమేసిన భర్త
నువ్వు పద్దతి మార్చుకుంటే తనతో కలిసి ఇంట్లో ఉంటావని, లేదంటే నీదారి నువ్వు చూసుకో అని వెంకటేష్ అతని భార్య సుధారాణికి తేల్చి చెప్పాడు. భర్త వార్నింగ్ ఇచ్చినా అతని భార్య సుధారాణి మాత్రం పద్దతిమార్చుకోలేదు. అంతే సుధారాణి చెప్పినమాట వినకపోడంతో ఆమె భర్త వెంకటేష్ ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను ఆమె పుట్టింటికి తరిమేశాడు.

ఆంటీతో కొత్త కాపురం పెట్టడానికి సిద్దం అయిన ప్రియుడు
చాలా కాలం నుంచి సుధారాణి ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటిలో నివాసం ఉంటూ హోసూరు సమీపంలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తోంది. భర్త దూరం కావడంతో సుధారాణిని అడిగే దిక్కులేకపోవడంతో ప్రియుడు భాస్కర్ తో ఎంజాయ్ చేస్తోంది. ఆదివారం రాత్రి భాస్కర్ నేరుగా సుధారాణి ఇంటికి వెళ్లాడు. నేను హోసూరులో కొత్తగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నానని, నిన్ను, నీ పిల్లలను అక్కడే పెట్టుకుని సంతోషంగా చూసుకుంటానని చెప్పాడు.

తమ్ముడి ఎంట్రీతో తారుమారు
ఆదివారం రాత్రి సుధారాణి ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఆమె ప్రియుడు భాస్కర్ తో కలిసి ఆటోలో హోసూరు బయలుదేరింది. ప్రియురాలు సుధారాణి కూడా ప్రియుడు భాస్కర్ తో కొత్త ఇంటిలో పెట్టి కాపురం చెయ్యడానికిప్రయత్నించింది. మార్గం మధ్యలో సుధారాణి పెద్ద కొడుకు ఆటోలో నుంచి కిందకు దూకేసి పారిపోయాడు, తరువాత సుధారాణి కొడుకు అతని మామ (సుధారాణి తమ్ముడు) మునిరాజు (28)కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అసలు విపయం తెలుసుకున్న మునిరాజు రగిలిపోయి అతని ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు.

ఆటో అడ్డగించి పట్టుకున్న తమ్ముడు
బెంగళూరులోని సుంకదకట్ట సమీపంలో సుధారాణి, ఆమె ప్రియుడు భాస్కర్ వెలుతున్న ఆటోను ఆమె తమ్ముడు మునిరాజు, అతని స్నేహితులు ప్రశాంత్ (21), నాగేష్ (22), మారుతి (23) కలిసి అడ్డగించారు. ఆటోను నేరుగా మునిరాజు ఇంటికి దగ్గరకు తీసుకు వచ్చారు. సుధారాణి, ఆమె రెండో కొడుకును ఇంట్లోకి పంపించిన మునిరాజు అక్క ప్రియుడు భాస్కర్ ను మాత్రం అతని ఆటోలో పిలుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చంపేసి శవం ఎత్తుకెళ్లిన తమ్ముడు
ఆటోను నిర్జనప్రదేశంలోని తీసుకెళ్లిన మునిరాజు కోపం తట్టుకోలేక భాస్కర్ మీద ఇనుపరాడ్ దాడి చేశాడు. మునిరాజు కొట్టిన దెబ్బలకు భాస్కర్ తల పగిలిపోయింది. భయపడిన మునిరాజు భాస్కర్ ను ఆసుపత్రిలో చేర్చడానికి ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో భాస్కర్ ప్రాణం పోయిందని తెలుసుకున్న మునిరాజు, అతని స్నేహితులు షాక్ అయ్యారు.

సార్.... వాడి కథ క్లోజ్....... ఆటోలో డెడ్ బాడీ ఉంది తెచ్చుకోండి
అక్క సుధారాణి ప్రియుడు భాస్కర్ ను చంపేసిన తమ్ముడు మునిరాజు, అతని ఫ్రెండ్స్ ఆదివారం అర్దరాత్రి అతని శవాన్ని ఆటోలో వేసుకుని నేరుగా బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అర్దరాత్రి డ్యూటీలో ఉన్న ఎస్ఐ దగ్గరకు వెళ్లిన మునిరాజు అతని ఫ్రెండ్స్ తాగడానికి మంచినీళ్లు అడిగారు. తరువాత సార్ వాడి కథ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడే చంపేశాము, ఆటోలో వాడి డెడ్ బాడీ ఉంది తెచ్చుకోండి అంటూ తీపీగా చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.
పోలీసులు భాస్కర్ శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భాస్కర్ ను హత్య చేసిన మునిరాజు, అతని స్నేహితులు మారుతి, ప్రశాంత్, నాగేష్ ను అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications