Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!

బెంగళూరు/ మైసూరు: పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేస్తున్న భర్తకు సినిమా కష్టాలు 70 MM స్క్రీన్ లో కనపడ్డాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భర్తకు నిద్రపట్టలేదు. భార్య పద్దతి మారాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. భార్య తనతో సక్రమంగా కాపురం చెయ్యాలని అనుకున్న భర్త మొదట ఇల్లు మారాడు. తరువాత ఏరియానే మార్చేశాడు. భార్య కోసం భర్త ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే భార్య ఆమెకోసం ఆ ఒక్కటి వదల్లేకపోయింది. అంతే ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త యమలోకానికి ఓ టిక్కెట్ రిజర్వు చేసి భార్యను అక్కడికి పంపించేశాడు.

భర్త ఫేమస్ బైక్ మెకానిక్

భర్త ఫేమస్ బైక్ మెకానిక్

రాచనగరి మైసూరు నగరంలోని రమాబాయి నగర్ లో రాజేష్ (40) అనే వక్తి నివాసం ఉంటున్నాడు. బైక్ మెకానిక్ అయిన రాజేష్ కు నళిని (34) అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. రాజేష్, నళిని దంపతులకు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. బైక్ లు చక్కగా రిపేర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకున్న రాజేష్ బాగానే డబ్బులు సంపాధిస్తూ భార్య, పిల్లలను చూసుకుంటున్నాడు.

గ్యాప్ లో యువకుడిని లైన్ లో పెట్టిన భార్య

గ్యాప్ లో యువకుడిని లైన్ లో పెట్టిన భార్య

రాజేష్ ప్రతిరోజు ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి గ్యారేజ్ కు వెళ్లిపోతాడు. వీలైతే మద్యాహ్నం భోజనానికి ఇంటికి వెలుతాడు. లేదంటే రాత్రి ఒకేసారి గ్యారేజ్ లో పని ముగించుకుని ఇంటికి వెళ్లేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు భర్త రాజేష్ డబ్బు సంపాధనలో ఉండేవాడు. అయితే రాజేష్ భార్య నళిని భర్త అందుబాటులో లేని గ్యాప్ లో మరో యువకుడిని లైన్ లో పెట్టింది.

మస్త్ మజా చేసింది

మస్త్ మజా చేసింది

రమాబాయి నగర్ లో నివాసం ఉంటున్న యువకుడిని లైన్ లో పెట్టిన నళిని భర్త బయటకు వెళ్లిపోయిన తరువాత అతన్ని ఇంటికి పిలుపించుకుని ఎంజాయ్ చేసింది. నళిని ఇంటికి వెలుతున్న ప్రియుడు ఆమెకు స్వర్గం చూపించాడు. చాలాకాలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా నళిని ఆమె ప్రియుడితో ఇంట్లోనేని బెడ్ రూమ్ లో సరసాలు ఆడింది.

భార్యకు వార్నింగ్

భార్యకు వార్నింగ్

నువ్వు లేని టైమ్ లో మీ ఇంటికి ఎవరో కుర్రాడు వచ్చి వెలుతున్నాడు ?, అతను ఎవరు ? అంటూ స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు రాజేష్ ను ప్రశ్నించారు. తనకు తెలీకుండా తన ఇంటికి ఎవరు వచ్చి వెలుతున్నారు ? అంటూ రాజేష్ ఆరా తీశాడు. ఆ సమయంలో తన భార్య నళిని ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రియుడితో కులుకుతోందని తెలుసుకున్న రాజేష్ మైండ్ బ్లాక్ అయ్యింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని, లేదంటే పరిస్థితి వేరుగా ఉంటుందని భర్త రాజేష్ అతని భార్య నళినికి అనేకసార్లు వార్నింగ్ ఇచ్చాడు.

మొగుడు ఇల్లు... ఏరియా మార్చేసినా పెళ్లాం మారలేదు

మొగుడు ఇల్లు... ఏరియా మార్చేసినా పెళ్లాం మారలేదు

తన భర్త రాజేష్ ఓ పిచ్చోడు, వాడు చెప్పిది వాడు చెబుతాడు, నేను చేసేది నేను చేస్తాను అంటూ భార్య నళిని అతని మాటలు పెద్దగా పట్టించుకోలేదు. తన భార్య నళిని మారదు అని డిసైడ్ అయిన భర్త రాజేష్ మొదట రమాబాయి నగర్ లో ఇంటిని మార్చేశాడు. అయినా నళినిలో మార్పు రాకపోవడంతో భర్త రాజేష్ చివరికి రమాబాయి నగర్ నుంచి అతని ఇంటిని జయనగర్ కు మార్చేశాడు.

నీ ఖర్మ నీది..... నా బాధ నాది

నీ ఖర్మ నీది..... నా బాధ నాది

ఎంతసేసినా భార్య నళిని మాత్రం ఆమె భర్త కోసం పద్దతి మార్చుకోలేకపోయింది. నీ ఖర్మ నీది.... నా బాధనాది అంటూ నళిని ఆమె దారిలోనే పోయింది. నా ప్రియుడిని మాత్రం తాను వదలనని నళిని ఆమె భర్త రాజేష్ కు తేల్చి చెప్పింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త రాజేష్ రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య నళినితో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు.

యమలోకానికి టిక్కెట్ రిజర్వ్ చేసిన భర్త

యమలోకానికి టిక్కెట్ రిజర్వ్ చేసిన భర్త

ఎంత చెప్పినా భార్య మాట వినకపోవడం, ఆమె మారకపోవడంతో రాజేష్ విసిగుచెందాడు. పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రాజేష్ భార్య నళినితో మరోసారి గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన రాజేష్ కత్తి తీసుకుని భార్య నళిని పొడిచి దారుణంగా చంపేశాడు. నీకు యమలోకానికి టిక్కెట్ రిజర్వు చేశానని, నువ్వు అక్కడికి వెళ్లిపో, తరువాత నీ ప్రియుడిని అక్కడికి పంపిస్తాను అని చస్తున్న భార్యతో అన్నాడు.

చిలకకు చెప్పినట్టు చెప్పాడు.... కాని?

చిలకకు చెప్పినట్టు చెప్పాడు.... కాని?

భార్య నళిని హత్య చేసి తప్పించుకుని పారిపోయిన రాజేష్ ను మైసూరులోని అశోక్ నగర పోలీసులు అరెస్టు చేశారు. భార్య నళిని కోసం భర్త ఎంత చేసినా ఆమె మారకపోవడంతోనే చివరికి రాజేష్ చంపేశాడని, ఇప్పుడు వాళ్ల పిల్లలు అనాథలు అయ్యారని అతని ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+