Illegal affair: కొత్త పెళ్లి కూతురు, సిమ్రాన్ ను నీటి సంప్ లో ముంచి చంపేసిన మొగుడు !

బెంగళూరు/చిక్కమగళూరు: ఇంట్లో చూపించిన యువకుడి వివాహం చేసుకున్న యువతి అతనితో వివాహం చేసుకుంది. సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న భర్తతో చక్కగా కాపురం చెయ్యడానికి ఆమె అత్తారింటికి వెళ్లింది. పెళ్లికి ముందే భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది. పెళ్లి కొడుకు వ్యవహారం తెలిసినా అతని కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడుకాకుండా వేరే యువతితో పెళ్లి చెయ్యడంతో ఇంట్లో గొడవలు మొదలైనాయి. భర్త అక్రమ సంబంధం గురించి నిలదీసిన భార్యకు టార్చర్ మొదలైయ్యింది. పెళ్లి చేసుకుని మూడు నెలల కాకముందే భర్త అతని భార్యను నీటి సంప్ లో ముంచేసి చంపేసి ఆత్మహత్య చేసుకుందని మంచి సినిమా కథ చెప్పడం కలకలం రేపింది.

మూడు నెలల ముందే సిమ్రాన్ పెళ్లి

మూడు నెలల ముందే సిమ్రాన్ పెళ్లి

కర్ణాటకలోని చిక్కమగళూరు నగరంలోని పెన్షన్ మోహల్లా ప్రాంతంలో ఫైరోజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిక్కమగళూరులోనే నివాసం ఉంటున్న సిమ్రాన్ (22) అనే యువతి ఇంట్లో చూపించిన ఫైరోజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సరే అని చెప్పింది. మూడు నెలల క్రితం ఫైరోజ్ ను సిమ్రాన్ వివాహం చేసుకుంది.

సంతోషంగా అత్తారింటికి వెళ్లింది

సంతోషంగా అత్తారింటికి వెళ్లింది

ఫైరోజ్ తో సిమ్రాన్ వివాహం గ్రాండ్ గానే జరిగింది. సంతోషంగా పెళ్లి చేసుకున్న సిమ్రాన్ భర్త ఫైరోజ్ తో చక్కగా కాపురం చెయ్యడానికి ఆమె పెన్షన్ మోహల్లాలోని అత్తారింటికి వెళ్లింది. రెండు నెలల పాటు భర్త ఫైరోజ్ అతని భార్య సిమ్రాన్ తో సంతోషంగానే కాపురం చేసినట్లు అందరిముందు నటించాడని సమాచారం.

 పెళ్లికి ముందే అక్రమ సంబంధం

పెళ్లికి ముందే అక్రమ సంబంధం


పెళ్లికి ముందే భర్త ఫైరోజ్ కు వేరే వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉంది. పెళ్లి కొడుకు ఫైరోజ్ వ్యవహారం తెలిసినా అతని కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడుకాకుండా సిమ్రాన్ తో పెళ్లి చెయ్యడంతో ఇంట్లో గొడవలు మొదలైనాయి. భర్త ఫైరోజ్ అక్రమ సంబంధాన్ని నిలదీసిన భార్య సిమ్రాన్ కు టార్చర్ మొదలైయ్యిందని తెలిసింది.

 చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన భర్త ?

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన భర్త ?

ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న ఫైరోజ్ రోజు పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య సిమ్రాన్ ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో మీ తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం సరిపోలేదని, అదనపు కట్నం తీసుకురావాలని మూడు నెలలకే భర్త ఫైరోజ్ అతని భార్య సిమ్రాన్ కు ఇంట్లో నరకం చూపించడాని ఆరోపణలు ఉన్నాయి. కట్నం తీసుకురాను అని ఎదురు తిరిగిన భార్య సిమ్రాన్ ను చంపేస్తానని ఆమె భర్త ఫైరోజ్ అనేకసార్లు వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది.

సిమ్రాన్ జలసమాధి

సిమ్రాన్ జలసమాధి

ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని సిమ్రాన్ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ అమలు చేసిన సమయంలోనే పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేదని సమాచారం. ఇదే సమయంలో ఫైరోజ్ అతని భార్య సిమ్రాన్ ను నీటిసంప్ లో ముంచేసి జలసమాధి చేశాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. భర్త ఫైరోజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు సిమ్రాన్ కు నరకం చూపించి నీటిలో ముంచేసి చంపేశారని సిమ్రాన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పెళైన మూడు నెలలకే ప్రాణం పోయింది

పెళైన మూడు నెలలకే ప్రాణం పోయింది

కేసు నమోదు చేసిన పోలీసులు ఫైరోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫైరోజ్ కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ సిమ్రాన్ కుటుంబ సభ్యులు చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పెళ్లి జరిగిన మూడు నెలలకే భర్త అక్రమ సంబంధం కారణంగా సిమ్రాన్ హత్యకు గురి కావడం చిక్కమగళూరులో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+