Lady: మహిళ ఇంట్లోనే మకాం వేస్తున్న యువకుడు, భర్త ఇంట్లో ఉంటే ?, ఇద్దరిని పొడిచేశాడు, భర్త ప్రాణం!

బెంగళూరు/హాసన్: దంపతులు నివాసం ఉంటున్న ఊరిలోనే నివాసం ఉంటున్న ఓ యువకుడు ఎక్కువగా వాళ్ల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆ యువకుడు అతని ఇంటికి వెళ్లి అతని భార్యతో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. వివాహిత మహిళకు, యువకుడికి అక్రమ సంబంధం ఉందని ఊరులో టామ్ టామ్ అయిపోయింది.

భర్త ఇంట్లో ఉన్న సమయంలోనే ఆ యువకుడు అక్కడికి వెళ్లి ఆమెను మాట్లాడటానికి ప్రయత్నించాడు. మర్యాదగా చెబుతున్నా, ఇక ముందు మా ఇంటి వైపు నువ్వురాకూడదు అని మహిళ ఆ యువకుడికి తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో రెచ్చిపోయిన యువకుడు అతనితో క్లోజ్ గా ఉంటున్న మహిళతో పాటు ఆమె భర్తను కత్తితో దారుణంగా పొడిచేశాడు. దెబ్బకు భర్త ప్రాణం పోయింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని క్యాతనహళ్లిలో జవరయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జవరయ్య మంజుల అనే మహిళను వివాహం చేసుకుని ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. జవరయ్య, మంజుల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి జవరయ్య, మంజుల దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

యువకుడి ఎంట్రీ

యువకుడి ఎంట్రీ

క్యాతనహళ్లిలో గిరి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. జవరయ్య ఇంటికి గిరి ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. జవరయ్య ఇంట్లో లేని సమయంలో గిరి అతని ఇంటికి వెళ్లి అతని భార్య మంజులతో చాలా చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. చాలాకాలం నుంచి గిరి మంజుల ఇంటికి వెళ్లి గంటలు గంటలు ఉంటున్నాడని ఆ ప్రాంతంలోని ప్రజలు గమనించారు.

అక్రమ సంబందం ఉందని టామ్ టామ్

అక్రమ సంబందం ఉందని టామ్ టామ్

వివాహిత మహిళ మంజులకు, గిరికి అక్రమ సంబంధం ఉందని క్యాతనహళ్లిలో టామ్ టామ్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జవరయ్య ఆవేదన చెందాడు. జవరయ్య ఇంట్లో ఉన్న సమయంలోనే గిరి అతని ఇంటికి వెళ్లి అతని భార్య మంజులతో బలవంతంగా మాట్లాడటానికి ప్రయత్నించాడు.

కత్తితో లేడీని పొడిచిపారేశాడు

కత్తితో లేడీని పొడిచిపారేశాడు

ఇదే విషయంలో జవరయ్య, మంజుల దంపతులకు, గిరికి గొడవ జరిగింది. మర్యాదగా చెబుతున్నా, ఇక ముందు మా ఇంటి వైపు నువ్వురాకూడదు మంజుల ఆమె ఇంటికి వెళ్లిన గిరి తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో రెచ్చిపోయిన గిరి అతనితో క్లోజ్ గా ఉంటున్న మంజులను పొడిచేశాడు. భార్య మంజులను పొడుస్తుంటే జవరయ్య అడ్డం వెళ్లాడు.

భర్త ప్రాణం పోయింది

భర్త ప్రాణం పోయింది

ఆవేశంతో ఊగిపోయిన గిరి కత్తితో జవరయ్యను పొడి చేశాడు. తీవ్రగాయాలైన జవరయ్య, మంజులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జవరయ్య ప్రాణం పోయింది. తీవ్రగాయాలైన మంజుల హాసన్ లోని హిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, పరారైన గిరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+