చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీలు బ్యాన్ చేసిన అధికారులు, బెంగళూరు ప్రజలకు షాక్ !
బెంగళూరు/మైసూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ప్రతిరోజు చికెన్, మటన్, చేపలు విక్రయాలతో కోట్ల రూపాయాల వ్యాపారాలు జరుగుతుంటాయి. బెంగళూరులో దిక్కులేనన్ని బార్ అండ్ రెస్టారెంట్ లు, లిక్కర్ షాపులు, పబ్ లు ఉన్నాయి. ప్రతిరోజు బార్ అండ్ రెస్టారెంట్ లలో వివిద రకాల మాంసాహార వంటకాలు అందుబాటులో ఉంటాయి.
ఇక ఐటీ హబ్ బెంగళూరులో దాదాపుగా అన్ని ఏరియాల్లో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీల సెంటర్లు ఉన్నాయి, ఉదయం నుంచి రాత్రి వరకు బిర్యానీలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. చికెన్, మటన్, చేపలతో వివిద రకాల వంటకాలు చేసి భారీగా విక్రయిస్తుంటారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు వారి స్నేహితులతో కలిసి ఎక్కువగా బిర్యానీ హౌస్ లకు వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా కడుపునిండా తింటున్నారు.

ఐటీ హబ్ బెంగళూరులో మాంసాహారం వంటకాలు విక్రయించని రోజు అంటూ ఉండదు. గాంధీ జయంతి రోజు కూడా మనోళ్లు సీక్రేట్ గా బిర్యానీలు చేసి అమ్మేస్తున్నారు. చికెన్, మటన్ సెంటర్లు ఓపెన్ చేసి కోళ్లు, గొర్రెలను కోసి మాంసం విక్రయిస్తున్నారు. ఇక ఫిష్ మార్కెట్ లు వేకువ జామున 4 గంటలకు ఓపెన్ అయిపోతాయి.
ఇప్పుడు బెంగళూరు ప్రజలకు బీబీఎంపీ అధికారులు ఝలక్ ఇచ్చారు. శ్రీరామనవమి పండుగ సందర్బంగా మార్చి 30వ తేదీ గురువారం బెంగళూరులో ఎవ్వరూ మాంసం విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా కోళ్లు, గోర్రెలు కోసి మాంసం విక్రయించకూడదని, చేపలు విక్రయించకూడదని, ఎక్కడా మాంసాహారం వంటకాలు విక్రయాలు చెయ్యకూడదని బీబీఎంపీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అధికారుల కళ్లు కప్పి ఎవరైనా మాంసం విక్రయించినా, బిర్యానీ సెంటర్లు, కబాబ్ సెంటర్లు విక్రయాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ అధికారులు హెచ్చరించారు. బెంగళూరు నగరంతో పాటు చామరాజనగర, చిక్కమగళూరు జిల్లాల పరిధిలోని అన్ని మునిసిపాలిటీల పరిధిలో శ్రీరామనవమి పండుగ సందర్బంగా మాంసాహారం విక్రయాలను నిషేధించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications