Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IT Raids: అప్ప అనుచరులకు షాక్, పత్రాలు మూటకట్టి అటకలో ? ఢిల్లీ దెబ్బకు మైండ్ బ్లాక్, మాజీ సీఎం !

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వర్గానికి ఆదాయపన్ను శాఖ (IT) అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఢిల్లీ దెబ్బకు మాజీ సీఎం అనుచరుల మైండ్ బ్లాక్ అయ్యింది. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పీఏతో పాటు ఆయన వర్గంలోని వారిగా ముద్ర వేసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాములు ముమ్మరం చేశారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లో గురువారం ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుమారుడు బీవై. విజయేంద్రకు అంత్యంత సన్నిహితుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉమేష్ ఇంటిలో మూటకట్టి అటకలో విసిరేసిన అనేక కీలమైన పత్రాలను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. 2012 నుంచి యడియూరప్ప పీఏగా పని చేస్తున్న ఉమేష్ ను, ఆయనకు అత్యంతం సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు కాంట్రాక్టర్లను ఐటీ శాఖ అధికారులు టార్గెట్ చేసుకున్నారని తెలిసింది.

సైలెంట్ గా ఉన్న మాజీ సీఎం

సైలెంట్ గా ఉన్న మాజీ సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బీఎస్. యడియూరప్పను బలవంతంగా కిందకు దించేసి ఆయన స్థానంలో బసవరాజ్ బోమ్మయ్ ని సీఎం కుర్చీలో కుర్చోబెట్టిన విషయం తెలిసింది. యడియూరప్పకు 75 సంవత్సరాలు దాటిపోయింది అనే ఒకేఒక సాకు అడ్డం పెట్టుకుని ఆయన్ను సీఎం పదవి నుంచి కిందకు దించేశారని ఆయన వర్గీయులు అంటున్నారు. సీఎం పదవి పోయినప్పటి నుంచి బీజేపీ అధికారిక పార్టీ కార్యక్రమాలకు బీఎస్ యడియూరప్ప అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

యడియూరప్ప పీఏకి షాక్ ఇచ్చిన ఐటీ శాఖ

యడియూరప్ప పీఏకి షాక్ ఇచ్చిన ఐటీ శాఖ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వర్గానికి ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం ఊహించని షాక్ ఇచ్చారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పీఏ ఉమేష్ తో పాటు ఆయన వర్గంలోని వారిగా ముద్ర వేసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాములు చేస్తున్నారు.

ఇవి ఆరోపణలు

ఇవి ఆరోపణలు

కర్ణాటక ఇరిగేషన్ శాఖలోని అనేక పథకాలకు కేటాయించిన నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కృష్ణ భాగ్య జల మండలి కాంట్రాక్టు పనులు కేటాయించడటంతో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపన్ను చెల్లించలేదని, అక్రమంగా నగదు బదిలీ చేశారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పీఏ ఉమేష్ తో పాటు ఆయన అనుచరుల మీద ఆరోపణలు వచ్చిన సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

యడియూరప్ప పీఏ ఇంటిలో కీలక పత్రాలు సీజ్ ?

యడియూరప్ప పీఏ ఇంటిలో కీలక పత్రాలు సీజ్ ?

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లో గురువారం ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుమారుడు బీవై. విజయేంద్రకు అంత్యంత సన్నిహితుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉమేష్ (యడియూరప్ప పీఏ) ఇంటిలో మూటకట్టి అటకలో విసిరేసిన అనేక కీలమైన పత్రాలను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

నమ్మినబంటుకు మైండ్ బ్లాక్

నమ్మినబంటుకు మైండ్ బ్లాక్


కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని అయనూరులో ఉమేష్ కు సొంత ఇల్లు ఉంది. 2012 నుంచి యడియూరప్ప పీఏగా పని చేస్తున్న ఉమేష్ ను, ఆయనకు అత్యంతం సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు కాంట్రాక్టర్లను ఐటీ శాఖ అధికారులు టార్గెట్ చేసుకున్నారని తెలిసింది. మొదట్లో ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఉమేష్ తరువాత బీఎస్. యడియూరప్ప పీఏగా చేశారు. గత 9 సంవత్సరాల నుంచి బీఎస్. యడియూరప్ప పీఏగా ఉన్న ఉమేష్ కర్ణాటక బీజేపీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్రమంగా కాంట్రాక్టు పనులు కేటాయించడంలో ఉమేష్ కీలకపాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+