బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: ఐఏఎస్ తల్లి ఎంట్రీతో సీన్ రివర్స్, బీజేపీకి చెమటలు, RRN పడుతుందా ? ఉప ఎన్నికల్లో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తుమకూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర్. తుమకూరు జిల్లాలోని శిరా అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికలు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల అభ్యర్థులు నువ్వానేనా అంటూ ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర్ నియోజక వర్గంలో తన కోడలిని గెలిపించాలని చివరి నిమిషంలో దివంగత ఐఏఎస్ అధికారి డీకే. రవి తల్లి రంగంలోకి దిగడంతో బీజేపీ నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి. మొత్తం మీద కర్ణాటకలోని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ ఉప ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం మొదలైయ్యింది.

friend wife: బిగ్ షాట్ కోడలు, స్టార్ హోటల్స్ లో ప్రియుడితో జల్సాలు, రూ. 20 కోట్లు గోవిందా గోవింద!friend wife: బిగ్ షాట్ కోడలు, స్టార్ హోటల్స్ లో ప్రియుడితో జల్సాలు, రూ. 20 కోట్లు గోవిందా గోవింద!

 బెంగళూరు ఆర్ఆర్ నగర్

బెంగళూరు ఆర్ఆర్ నగర్

బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర్ లో మంగళవారం అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఆర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ సినీనిర్మాత, వ్యాపారవేత్త మునిరత్న విజయం సాధించారు. తరువాత ఆపరేషన్ కమలలో భాగంగా మునిరత్న బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆర్ఆర్ నగర్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ నగర్ లో మొత్తం 16 మంది బరిలో ఉన్నారు.

ఐఏఎస్ అధికారి భార్య

ఐఏఎస్ అధికారి భార్య

బెంగళూరు ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ నుంచి మునిరత్న బరిలో ఉన్నారు. దివంగత ఐఏఎస్ అధికారి డీకే. రవి భార్య హెచ్. కుసుమా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆర్ఆర్ నగర్ లో జేడీఎస్ పార్టీ అభ్యర్థికూడా కొంత పోటీనే ఇస్తున్నారు. అయితే ప్రధానంగా అధికార బీజేపీ పార్టీ అభ్యర్థి మునిరత్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుసుమా మద్య నువ్వానేనా అంటూ పోటీ ఎదురైయ్యింది.

డీకే రవి తల్లి ఎంట్రీతో సీన్ రివర్స్

డీకే రవి తల్లి ఎంట్రీతో సీన్ రివర్స్

ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో తన కోడలు కుసుమాకు ఓటు వెయ్యాలని దివంగత ఐఏఎస్ అధికారి డీకే. రవి తల్లి గౌరమ్మ స్థానిక ఓటర్లకు మనవి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉప ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు డీకే రవి తల్లి గౌరమ్మ మాట్లాడుతున్న వీడియో బయటకు రావడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.

నా కొడుకు ఫోటో పెడితే కాల్చి బూడిద చేస్తా

నా కొడుకు ఫోటో పెడితే కాల్చి బూడిద చేస్తా

కుసుమా తనకు కూతురితో సమానం, నాకొడుకు డీకే. రవి, కుసుమాతో కలిసి తాను నాలుగు సంవత్సరాలు కలిసి బతికాను, ఆమె చాలా మంచిది, ఆమెకు ఓటు వేసి గెలిపించాలని ఆర్ఆర్ నగర ప్రజలకు డీకే. రవి తల్లి గౌరమ్మ వేడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఉప ఎన్నికల సందర్బంగా తన కొడుకు డీకే. రవి ఫోటో ఉపయోగిస్తే కాల్చి బూడిద చేస్తానని గౌరమ్మ కోడలు కుసుమాను, కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పోలింగ్ కు కొన్ని గంటల ముందు అదే గౌరమ్మ తన కొడలు కుసుమాకు ఓటు వెయ్యాలని వేడుకుంటున్న వీడియో బయటకు రావడం కలకలం రేపింది.

 శిరా ఎవరి ఖాతాలో పడుతుంది?

శిరా ఎవరి ఖాతాలో పడుతుంది?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుమకూరు జిల్లా శిరా నియోజక వర్గంలో జేడీఎస్ పార్టీ విజయం సాధించింది. తరువాత జరిగిన ఆపరేషన్ కమలలో శిరా నియోజక వర్గం ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎలాగైనా శిరా నియోజక వర్గంలో విజయం సాధించాలని బీజేపీ అభ్యర్థి డాక్టర్ రాజేష్ గౌడ, కాంగ్రెస్ అభ్యర్థి టీబీ. జయచంద్రతో పార్టీ ఇరుపార్టీల నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. శిరా నియోజక వర్గం ఉప ఎన్నికల్లో మొత్తం 15 మంది బరిలో ఉన్నారు. మొత్తం మీద కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు అధికార పార్టీ బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి.

English summary
Karnataka Bypolls 2020: Bengaluru RR Nagar and Sira By Elections. The results will be declared on Tuesday, November 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X