బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

BJP:మరో సీఎం మార్పు, యడ్డీ ఔట్! -ఈనెల 26న karnataka బీజేఎల్పీ మీటింగ్ -ఆరోజే కొత్త సీఎం ఎన్నిక!, ఎవరంటే

|
Google Oneindia TeluguNews

కర్ణాటక బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు, ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేల విభేదాలకు హైకమాండ్ ఎట్టకేలకు పరిష్కారం చూపిందని, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసమ్మతి దృష్ట్యా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోడానికి బీఎస్ యడియూరప్పను ఒప్పించిందని ఉదయం నుంచి వస్తోన్న వార్తలను నిజం చేస్తూ.. స్వయంగా యడ్యూరప్పే అతికీలకమైన పిలుపునిచ్చారు..

జగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్‌ జగడం: రఘురామ సంచలనంజగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్‌ జగడం: రఘురామ సంచలనం

కాంగ్రెస్-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని కూలదోసి రెండేళ్ల కిందట కర్ణాటక గద్దెనెక్కిన బీజేపీ.. వృద్ధ నేత బీఎస్ యడియూరప్పనే మళ్లీ సీఎంగా కూర్చొబెట్టిననాటి నుంచీ అసమ్మతులు వెల్లువెత్తడం, అయినాసరే కుర్చీ దిగడానికి యడ్డీ నిరాకరిస్తూ రావడంతో ఏళ్లుగా హైడ్రామా కొనసాగుతున్నది. అయితే, ఇటీవలి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో యడ్డీ వర్గానికి ప్రాధాన్యం కల్పించిన కేంద్రం.. అదే ఊపులో ఆయన చేత రాజీనామాకు కూడా ఒప్పించింది. ప్రధాని మోదీతో భేటీలో..

karnataka cm change: B S Yediyurappa calls BJP LP meeting on July 26, pralhad joshi in probables

అనారోగ్య కారణాల రీత్యా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కర్నాటక సీఎం యడియూరప్ప ప్రధాని మోదీకి తెలియజేశారని విశ్వసనీయంగా వెల్లడైంది. శుక్రవారం నాటి యడ్డీ-మోడీ మీటింగ్ వివరాలు శనివారం నాడు బీజేపీ వర్గాల ద్వారా బహిర్గతం అయ్యాయి. సీనియర్ నేత అయిన యడ్డీపై వేటు గట్రా లేకుండా మర్యాదపూర్వకంగానే పంపేందుకు కేంద్రం పెద్దలు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని, ప్రధానితో భేటీలో సీఎం తన మనసులో మాట చెప్పేశారని మీడియా రిపోర్టులు వచ్చాయి. ఇక తదుపరి ప్రక్రియగా..

యడియూరప్ప రాజీనామా దాదాపు ఖరారైందన్న వార్తల నడుమ స్వయంగా ఆయనే ఇచ్చిన ఓ ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈనెల 26న కర్ణాటక బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ(బీజేఎల్పీ) సమావేశానికి సీఎం యడ్డీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి ప్రకటన వెలువడినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అదే సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుదని తెలుస్తోంది. అయితే యడ్డీ వర్గం మాత్రం, ఆయన రాజీనామా చేయబోరని, సీఎంగా బాధ్యతలు చేపట్టి జులై 26తో రెండేళ్లు పూర్తవుతాయి కాబట్టి ఆ సందర్భంగా మాత్రమే బీజేఎల్పీ సమావేశం జరుగనుందని వాదిస్తున్నారు. మరోవైపు

షాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరిషాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరి

ఉత్తరాఖండ్ లో 4 నెలల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన బీజేపీ హైకమాండ్.. కర్ణాటకలో యడియూరప్పను తప్పించడం ద్వారా మరీ సీఎంను మార్చేసినట్లవుతుంది. యడ్డీ రాజీనామా అంశం అధికారికంగా ఖరారు కానప్పటికీ, ఈనెల 26న జరుగబోయే బీజేఎల్పీ మీటింగ్ అజెండా బయటికి రానప్పటికీ, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి వీరే కావొచ్చంటూ కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. యడ్డీ నిష్క్రమణ తర్వాత కర్ణాటక సీఎంగా ప్రస్తుత హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, గనుల శాఖ మంత్రి మురుగేశ్ నిరాని లేదా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని చర్చ నడుస్తోంది.

English summary
Karnataka Chief Minister BS Yediyurappa has convened the BJP legislature party meeting on July 26, the day on which he completes two years in office. media reports sais that cm offered to resign citing ill health during his meeting with PM modi. the probable names for the Chief Minister's post are state Home Minister Basavaraj Bommai, Mines Minister Murugesh Nirani and Parliamentary Affairs Minister Pralhad Joshi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X