ముస్లీం గూండాల మీద కేసులు ఎత్తివేస్తే ?, ఈశ్వరప్ప ఏందప్పా ఇది, సంచలనం!
బెంగళూరు: మతోన్మాదులకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా మద్దతు ఇస్తోందని, ఇలాంటి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని నిరూపిస్తోందని, ముస్లిం గూండాలపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవద్దని కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కర్ణాటక ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఈ విషయమై మాజీ మంత్రి ఈశ్వరప్ప బుధవారం శివమొగ్గలో మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులోని కేజీ హళ్లి, డీజే హళ్లి, హుబ్బళి, శివమొగ్గలో ముస్లీం గుండాలు రెచ్చిపోయారని ఆరోపించారు. ఇవన్నీ ముస్లిం గూండాలు చేసిన పనులు, ఏ కారణం చేతనూ అప్పుడు నమోదు అయిన కేసులు వెనక్కి తీసుకోరాదని ఈశ్వరప్ప కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీ ఉన్న సమయంలో హిందువులకు ఉపయోగపడే అనేక మంచి పనులు చేశామని, కులాలు, మతాలకు అతీతంగా నీటిపారుదల శాఖలో పనులు చేశామని, దలితులకు పలు శాఖల్లో వారి పనులు పూర్తి చేశామని, కొన్ని పనులు మాత్రం పెండింగ్ లో ఉండిపోయాయని, అయితే ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి ఈఎస్. ఈశ్వరప్ప ఆరోపించారు.
కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకున్నామని, అయితే మీరు ఇచ్చిన ఉచిత హామీలు ఇవ్వాల్సిందేనని ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. శాసనసభ్యులు గ్రాంట్లు ఆశించని పరిస్థితి కర్ణాటకలో ఎదురైయ్యిందని, అన్ని నియోజక వర్గాల్లో నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఈశ్వరప్ప అన్నారు.
కొత్త పనులకు డబ్బులు అడగడం లేదు. సగం చేసిన పనులు చేయాల్సిందేనని కేఎస్. ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. నియోజక వర్గాల అభివృద్ధికి రూ.10 కోట్ల నుంచి రూ. 100 కోట్లు మంజూరు చేయాలని తాను కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులివ్వడం కావడంలేదని స్వయంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారని ఈఎస్. ఈశ్వరప్ప ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదని, అప్పుడే ప్రభుత్వంలో, పార్టీలో విభేదాలు మొదలయ్యాయని, కాంగ్రెస్ పార్టీలోనే 30 మందికి పైగా శాసనసభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి బహిరంగంగా లేఖ రాయడం వైరల్‌గా మారిందని, ఆ లేఖ నకిలీ కాదని, అది నకిలి అయితే విచారణ చేయించాలని, లేక ఇతర పార్టీలు అలా చేశాయా అని దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేఎస్ ఈశ్వరప్ప డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications