తండ్రిని గెలిపించి కొడుకును ఓడించిన సేమ్ ముస్లీం ఓటర్లు, ఏం జరిగింది అంటే?

బెంగళూరు/రామనగర: ఒక పార్టీకి ఓ వర్గం ఓటర్లు మద్దతు ఇస్తున్నారు. ఒకే జిల్లాలో వరుసగా ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న నాయకుడు ఇప్పటికే సీఎం అయ్యారు. అయితే సీఎంతో పాటు ఆయన భార్యను గెలిపించిన ప్రజలు వారి దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే క్లైమాక్స్ లో మాజీ సీఎం ను గెలిపించిన ఓటర్లు అదే మాజీ సీఎం కుమారుడిని ఓడించడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 66 స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత కింగ్ మేకర్ కావాలని అనేక ఆశలుపడిన మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ దళపతి ఆయన పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించడంతో అసహనానికి గురైనారు.

Karnataka: Muslim voters sent the son home after winning the father as MLA

ఇది అంతా ఒకవైపు అయితే తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సొంత పార్టీకి కంచుకోటలో పోటీకి దింపారు. ఒకసారి తనను, మరోసారి తన భార్యను గెలిపించిన ఓటర్లు ఇప్పుడు తన కుమారుడిని కూడా గెలిపిస్తారని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి చాలా ధీమాతో ఆయన కొడుకు నిఖిల్ కుమారస్వామిని రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించారు.

అయితే చెన్నపట్టణలో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామిని గెలిపించిన ఓటర్లు ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని రామనగరలో చిత్తుచిత్తుగా ఓడించారు. చెన్నపట్టణలో ఏ ముస్లీం ఓటర్లు అయితే జేడీఎస్ దళపతి హెచ్ డీ కుమారస్వామిని గెలిపించారో అదే ముస్లీం ఓటర్లు రామనగరలో నిఖిల్ కుమారస్వామిని ఓడించారు.

Karnataka: Muslim voters sent the son home after winning the father as MLA

ఇంతకాలం మన పార్టీని, తనతో పాటు తన భార్యను గెలిపించి ఎంతో ఆదరించిన ముస్లీం సోదరులు రామనగరలో తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఎందుకు ఓడించారు ?, అసలు ఆ నియోజక వర్గంలో ఏం జరిగింది ?, ఆమధ్యలో ఏం జరిగింది ? అని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఆరా తీస్తున్నారని తెలిసింది. అయితే నిఖిల్ కుమారస్వామి గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి, ఇప్పుడు రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా ఓడిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+