బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Karnataka Next CM: బాంబు పేల్చిన యడియూరప్ప కొడుకు, సేమ్ సీన్ రిపీట్, లీడర్లకు షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంలో డిసైడ్ చెయ్యడానికి ఐటీ హబ్ బెంగళూరులో సమావేశం నిర్వహిస్తున్నారు. పెద్ద పంచాయితీ ఢిల్లీలోనే అయినా టాపిక్ మాత్రం ఐటీ హబ్ బెంగళూరులో జరగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక బీజేపీ నాయకుడు బీఎల్. సంతోష్ ఢిల్లీలో మకాం వేసి మొత్తం గమనిస్తున్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభిప్రాయాలు తెలుసుకునే బాధ్యతను కేంద్ర మంత్రులు దర్రేంద్ర ప్రధాన్, జీ. కిషన్ రెడ్డి, కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ కు అప్పగించారు. ఇదే సమయంలో కొత్త సీఎం విషంపై బీఎస్. యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఎంపీ బీవై. రాఘవేంద్ర బాంబు పేల్చాడు.

కర్ణాటకలో కౌంట్ డౌన్

కర్ణాటకలో కౌంట్ డౌన్


కర్ణాటకలో నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్, యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చెయ్యడంతో ఆయన వారసుడు ఎవరు అని జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించడానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఈరోజు లేదా రేపు (జులై 28వ తేది)న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి పేరు ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.

 ఐటీ హబ్ లో ఈ రోజు రాత్రి మీటింగ్

ఐటీ హబ్ లో ఈ రోజు రాత్రి మీటింగ్


కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై ఈ రోజు (జులై 27 మంగళవారం) రాత్రి 7 గంటలకు బెంగళూరులోని ఓ స్టార్ హోటల్ లో ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు దర్రేంద్ర ప్రధాన్, జీ. కిషన్ రెడ్డి, కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ ఈరోజు రాత్రి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.

ఈరోజు పని అవుతుందా ?

ఈరోజు పని అవుతుందా ?

మంగళవారం రాత్రి బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఎంతసేపులో ముగుస్తుందో ? చెప్పడం చాలా కష్టం అని ఆ పార్టీ సీనియర్ నాయకులు కొందరు అంటున్నారు. బెంగళూరులో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని అరుణ్ సింగ్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత వారి అభిప్రాయాలు ఏమిటి ? అనే పూర్తి సమాచారం బీజేపీ హైకమాండ్ కు పంపిస్తామని, తరువాత కొత్త సీఎం పేరు ప్రకటిస్తామని అరుణ్ సింగ్ చెప్పారు.

బాంబు పేల్చిన యడియూరప్ప కొడుకు

బాంబు పేల్చిన యడియూరప్ప కొడుకు

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నిన్న రాజీనామా చేసిన బీఎస్. యడియూరప్ప కుమారుడు, శివమొగ్గ బీజేపీ ఎంపీ బీవై. రాఘవేంద్ర బాంబు పేల్చారు. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై మంగళవారం శివమొగ్గలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ బీవై, రాఘవేంద్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకులను అయోమయంలో పడేశారు.

యూపీ, మహారాష్ట్రలో జరిగినట్లే కర్ణాటకలో సేమ్ సీన్ రిపీట్

యూపీ, మహారాష్ట్రలో జరిగినట్లే కర్ణాటకలో సేమ్ సీన్ రిపీట్

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో ఎలా కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయో ఇప్పుడు కూడా అలాగే కొత్తపేర్లు తెరమీదకు వస్తాయని, ఎవ్వరూ ఊహించని వ్యక్తి సీఎం అవుతారని యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఎంపీ బీవై. రాఘవేంద్ర మీడియాకు చెప్పారు. యడియూరప్ప కుమారుడు బీవై. రాఘవేంద్ర మాటలతో కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకులు అయోమయంలో పడిపోయారు.

English summary
Karnataka Next CM: Shivamogga MP and Mr. Yediyurappa’s son B.Y. Raghavendra told mediapersons that the next Chief Minister of Karnataka will be a surprise choice like the ones the party made in Maharashtra and Uttar Pradesh, adding to more suspense within party circles and the public alike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X