Leader: రూ. 100కే అందరికి బ్లూఫిల్మ్ చూపించిన గొప్ప లీడర్ ఆ మాజీ మంత్రి, అంతు చూస్తా, చాలెంజ్!
ఒక్కొక్కరి దగ్గర రూ. 100 వసూలు చేసి బ్లూఫిల్మ్ చూపించి రాజకీయాల్లోకి వచ్చిన డీకే శివకుమార్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెబుతున్నారని, అతను పెద్ద మోసగాడు అంటూ రమేష్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు/బెళగావి: కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు తొలి అస్త్రంగా ఆడియోను విడుదల చేశానని, ఇంకా నా దగ్గర 20 ఆడియో టేపులు ఉన్నాయని కర్ణాటక మాజీ మంత్రి, రాసలీలల సీడీ కేసులో మంత్రి పదవి పోగొట్టుకున్న బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి బాంబు పేల్చారు.
ఒక్కొక్కరి దగ్గర రూ. 100 వసూలు చేసి బ్లూఫిల్మ్ చూపించి రాజకీయాల్లోకి వచ్చిన డీకే శివకుమార్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెబుతున్నారని, అతను పెద్ద మోసగాడు అంటూ రమేష్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. టైమ్ చూసి ఒక్కక్క ఆడియో విడుదల చేస్తానని రమేష్ జారకిహోళి అన్నారు.

డీకే శివకుమార్ ను వదిలి పెట్టను
డీకే శివకుమార్ మీద పోరాటం చెయ్యడానికి తాను డిసైడ్ అయ్యానని, మా పార్టీ నేతలతో చర్చించి డీకే మీద పోరాటం కొనసాగిస్తానని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి అన్నారు.బెళగావిలో మీడియాతో మాట్లాడిన రమేష్ జారకిహోళి ఇప్పుడు సీడీ కేసు విచారణపై బీజేపీ నేతల అభిప్రాయం తీసుకుంటాననని అన్నారు. తాను వ్యక్తిగతంగా ఈ కేసును కొనసాగిస్తాను, డీకే శివకుమార్ మీద పోరాటం చేస్తానని. అతని గురించి తన దగ్గర ఉన్న అన్ని సీడీలు బయట పెడుతానని రమేష్ జారకిహోళి హెచ్చరించారు.

ఆడియోలో ఏముంది అంటే?
కేపీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియోను క్లిప్ ను మాజీ మంత్రి రమేష్ జారకిహోళి విడుదల చేశారు. డీకే శివకుమార్ మాట్లాడినట్లు ఉన్న ఆ ఆడియో టేప్ 19 సెకన్లు ఉంది. ఈ సమయంలో డీకే శివకుమార్ ఓ వ్యక్తితో ఆయన ఆస్తుల గురించి వివరించినట్లు ఉందని, ఇలాంటి ఆడియో టేపులు చాలా ఉన్నామని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి అన్నారు.

దుబాయ్, లండన్, ఢిల్లీలో ఇండ్లు!
తనకు దుబాయ్ ఓ ఓ ఇల్లు, లండన్ లో ఓ ఇల్లు, ముంబాయిలో ఖరీదైన ఫ్లాట్, ఢిల్లీలో ఓ ఇల్లు ఉందని డీకే శివకుమార్ చెప్పినట్లు ఆడియోలో ఉంది. గతంలో ఐటీ శాఖ అధికారులు తన ఇంటి మీద దాడులు చేసిన సమయంలో కేవలం రూ 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయని డీకే శివకుమార్ చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది.

రూ. 100కే బ్లూఫిల్మ్ చూపించిన గొప్ప లీడర్
గతంలో కనకపురలో డీకే శివకుమార్ ఒక్కొక్కరి నుంచి రూ. 100 వసూలు చేసి వారికి సీక్రేట్ గా బ్లూఫిల్మ్ చూపించడాడని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి సంచనల వ్యాఖ్యలు చేశారు. అలాంటి నీచమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్ద నాయకుడు అయిపోయాడని, ఆయన అసలు స్వరూపం తెలిసినా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మౌనంగా ఉన్నారని, కాని నేను మాత్రం డీకే శివకుమార్ ను వదిలిపెట్టనని, ఆయన రాజకీయ జీవితం అంతం చేస్తానని రమేష్ జారకిహోళి శపథం చేశారు.












Click it and Unblock the Notifications