బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: ఐటీ హబ్ లో కూతురు, అల్లుడితో ?, మూడు రోజులు నిమ్మకాయలు, దెయ్యం పట్టిందని చంపేసిన పూజారి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హాసన్: వివాహం జరిగిన దంపతులకు ఓ కూతురు పుట్టింది. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోవడంతో ఆమె కూతురితో కలిసి జీవిస్తోంది. సోదరి, ఆమె భర్త కుటుంబ సభ్యులు సహాయం చెయ్యడంతో కూతురిని పెంచి పోషించింది. కూతురికి వివామం చేసిన మహిళ ఆమె, అల్లుడితో పాటు ఐటీ హబ్ చేరుకుని నివాసం ఉంటోంది. కొంతకాలంగా మహిళకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. కూతురు, అల్లుడు ఆమెకు ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

ఎన్నిసార్లు ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఆమెకు తలనొప్పి మాత్రం తగ్గలేదు. ఆసుపత్రిలో వ్యాధి నయం కాలేదని ఆమెను గుడిలో పూజారి దగ్గర నాటు వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. మహిళకు భూతం పట్టిందని చెప్పిన పూజారి ఆమెను మూడుసార్లు గుడికి పిలిపించుకుని నిమ్మకాయలు మాత్రించి ఇచ్చాడు.

నాలుగోసారి గుడి దగ్గరకు వెళ్లిన మహిళను కర్ర తీసుకుని చితకబాదేసి దెయ్యాన్ని తరిమేస్తానని నానా హంగామా చేశాడు. దెబ్బలు తట్టుకోలేని మహిళ స్పృహతప్పి పడిపోయింది. దెయ్యం దిగిపోయిందని, నిమ్మరసం తాగిస్తే అంతా సరిపోతుందని పూజారి చెప్పాడు. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో రెండు ఆసుపత్రులు తిప్పడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దెయ్యం దిగిపోతుందని చితకబాదిన పూజారి మీద హత్య కేసు నమోదు కావడంతో కేటుగాడు పరారైనాడు.

College gilr: ఆర్ టీసీ బస్సులో ఆరాచకం, కాలేజ్ అమ్మాయి చిక్కిందని కండెక్టర్, డ్రైవర్ ?, దూకేసింది!College gilr: ఆర్ టీసీ బస్సులో ఆరాచకం, కాలేజ్ అమ్మాయి చిక్కిందని కండెక్టర్, డ్రైవర్ ?, దూకేసింది!

దురదృష్టం వెంటాడింది

దురదృష్టం వెంటాడింది

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయణపట్టణ తాలుకాలోని గౌడరహళ్ళిలో పార్వతి (37) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం కుమార్ అనే వ్యక్తితో పార్వతి వివాహం జరిగింది. వివాహం జరిగిన పార్వతి, కుమార్ దంపతులకు ఓ కూతురు పుట్టింది. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకే భర్త కుమార్ చనిపోవడంతో పార్వతి ఆమె కూతురు చైత్రాతో కలిసి జీవించింది.

కూతురు పెళ్లి చేసిన పార్వతి

కూతురు పెళ్లి చేసిన పార్వతి

సోదరి మంజుల, ఆమె భర్త కుటుంబ సభ్యులు సహాయం చెయ్యడంతో పార్వతి ఆమె కూతురు చైత్రానుని పెంచి పోషించింది. కూతురు చైత్రాను జయంత్ అనే యువకుడికి వివాహం చేసిన పార్వతి కూతురు, అల్లుడితో పాటు ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని వారితోనే సంతోషంగా నివాసం ఉంటోంది.

విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స

విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స

కూతురు చైత్రా, అల్లుడు జయంత్ కలిసి సంతోషంగా జీవిస్తున్న పార్వతి అనారోగ్యానికి గురైయ్యింది. కొంతకాలంగా పార్వతికి విపరీతమైన తలనొప్పి వస్తోంది. కూతురు, అల్లుడు ఆమెకు బెంగళూరులోని ప్రముఖ విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎన్నిసార్లు ఆసుపత్రిలో చికిత్స చేయించినా పార్వతికి మాత్రం తలనొప్పి తగ్గలేదు.

అక్క సలహాతో నాటువైద్యం

అక్క సలహాతో నాటువైద్యం

సొంతఊర్లో ఉంటున్న అక్క మంజులకు ఫోన్ చేసిన పార్వతి తనకు విపరీతంగా తలనొప్పి వస్తోందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా తలనొప్పి మాత్రం తగ్గలేదని చెప్పింది. ఆసుపత్రిలో వ్యాధి నయం కాలేదని పార్వతికి చెన్నరాయణపట్టణలోని చెక్క గ్రామంలోని హిరియపట్టదేవలమ్మ ఆలయంలోని పూజారి మను అలియాస్ మధు దగ్గర నాటు వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

మూడుసార్లు నిమ్మకాయలు..... నాలుగో సారి?

మూడుసార్లు నిమ్మకాయలు..... నాలుగో సారి?

పార్వతిని గుడిలోని పూజారి మను దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. పార్వతికి భూతం, దెయ్యం పట్టిందని చెప్పిన పూజారి మను ఆమెను మూడుసార్లు గుడికి పిలిపించుకుని నిమ్మకాయలు మాత్రించి ఇచ్చి నిమ్మరసం నీటిలో కలుపుకుని తాగాలని చూసించాడు. నాలుగోసారి గుడి దగ్గరకు వెళ్లిన పార్వతిని కర్ర తీసుకుని చితకబాదేసిన మను ఆమె శరీరంలో ఉన్న దెయ్యాన్ని తరిమేస్తానని నానా హంగామా చేశాడు.

దెబ్బలు తట్టుకోలేక కుప్పకూలిన మహిళ

దెబ్బలు తట్టుకోలేక కుప్పకూలిన మహిళ

పూజారి మను కొట్టిన దెబ్బలు తట్టుకోలేని పార్వతికి గుడిలోనే స్పృహతప్పి కూప్పకూలి కింద పడిపోయింది. పార్వతి శరీరంలో ఉన్న దెయ్యం దిగిపోయిందని, నిమ్మరసం తాగిస్తే అంతా సరిపోతుందని పూజారి మను ఆమెను ఇంటికి పంపించేశాడు. పార్వతిని ఇంటికి పిలుచుకుని వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెకు నిమ్మరసం తాగించారు.

వేకువ జామున షాక్

వేకువ జామున షాక్

పూజారి కొట్టిన దెబ్బలతో నీరసంతో నిద్రపోయిన పార్వతి మరుసటి రోజు వేకువ జామున తీవ్రఅస్వస్థతకు గురైయ్యింది. వెంటనే పార్వతిని చెన్నరాయణపట్టణ ఆసుపత్రికి తరలించారు అక్కడ పార్వతికి ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఆమెను హాసన్ లోని హిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాసన్ ఆసుపత్రిలో పార్వతి ప్రాణం పోయింది. పూజారి కొట్టిన దెబ్బలు తట్టుకోలేక పార్వతి ప్రాణం పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూజారి మీద హత్య కేసు

పూజారి మీద హత్య కేసు

పోలీసులు నాటు వైద్యుడైన పూజారి మను మీద హత్య కేసు నమోదు చేశారు. తన మీద హత్య కేసు నమోదు చేశారని తెలుసుకున్న దొంగ పూజారి మను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పరారైనాడు. కంప్యూటర్ కాలంలో కూడా నాటు వైద్యం చేయించుకోవాలని బెంగళూరు నుంచి వెళ్లి పార్వతికి దెయ్యం ఉందని చెప్పి పూజారి చితకబాదడంతో ఆమె ప్రాణం పోవడంతో కలకలం రేపింది.

English summary
Lady: A sick woman Died After Assaulted by Priest in Bekka village in Channarayapatna near Hassan in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X