Lady: ఫ్రెండ్స్ తో కలిసి గర్ల్ ఫ్రెండ్ ను గ్యాంగ్ రేప్ చేసిన శాడిస్టు, ఐటీ హబ్ లో కలకలం, ఫోన్ చేసి, కారులో!
బెంగళూరు: యువతికి ఓ యువకుడు పరిచయం ఉన్నాడు. యువతి ఆమె స్నేహితుడితో టచ్ లో ఉంది. ఇదే సందర్బంలో యువకుడి స్నేహితులు కూడా ఆమెకు పరిచయం అయ్యారు. అప్పుడప్పుడు అందరూ కలుస్తూ హోటల్ కు, సినిమాలు, షికార్లకు తిరుగుతున్నారు. సాయంత్రం యువతికి ఫోన్ చేసిన ఆమె బాయ్ ఫ్రెండ్ బయటకు వెలుదామని చెప్పాడు. యువతిని కారులో పిలుచుకుని వెళ్లాడు. సిటీలోని నిర్జనప్రదేశంలోకి యువతిని పిలుచుకుని వెళ్లి అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్బంలో బాయ్ ఫ్రెండ్ స్నేహితులు అక్కడికి వెళ్లారు.
కారులోనే యువతి మీద నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. మ్యాటర్ బయటకు తెలిస్తే నిన్ను చంపేస్తామని, గ్యాంగ్ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని యువతికి వార్నింగ్ ఇచ్చారు. తరువాత యువతి ధైర్యం చెయ్యడంతో బాయ్ ఫ్రెండ్ తో పాటు అతని స్నేహితుల మ్యాటర్, కామాంధుల స్కెచ్ మొత్తం రివర్స్ అయ్యింది.

యువతికి బాయ్ ఫ్రెండ్
బెంగళూరు నగరంలోని ఈజీపుర మెయిన్ రోడ్డులో ఓ యువతి నివాసం ఉంటున్నది. యువతికి దీపు అనే యువకుడు పరిచయం ఉన్నాడు. యువతి ఆమె స్నేహితుడ దీప్ కు నిత్యం టచ్ లో ఉంది. ఇదే సందర్బంలో దీపు స్నేహితులు ఆఖిలేష్ తదితరులు కూడా ఆమెకు పరిచయం అయ్యారు. అప్పుడప్పుడు యువతి, దీపు, అఖిలేష్ తదితరులు కలుస్తున్నారు.

ఫోన్ చేసి కారులో పిలుచుకుని వెళ్లిన బాయ్ ఫ్రెండ్
వీకెండ్ సమయంలో అమ్మాయితో ఆమె బాయ్ ఫ్రెండ్ దీపుతో పాటు అతని స్నేహితులు హోటల్ కు, సినిమాలు, షికార్లకు తిరుగుతున్నారు. సాయంత్రం యువతికి ఫోన్ చేసిన ఆమె బాయ్ ఫ్రెండ్ దీపు బయటకు వెలుదామని చెప్పాడు. ఈజీపుర మెయిన్ రోడ్డు సమీపంలోకి వెళ్లిన దీపు అతని గర్ల్ ఫ్రెండ్ ను అతని కారులో పిలుచుకుని వెళ్లాడు.

ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన బాయ్ ఫ్రెండ్
బెంగళూరు సిటీ పరిధిలోని హెచ్ఏఎల్ సమీపంలోని నిర్జనప్రదేశంలోకి యువతిని పిలుచుకుని వెళ్లి దీపు అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్బంలో దీపు స్నేహితులు అఖిలేష్ తో పాటు మరో ఇద్దరు అక్కడికి వెళ్లారు. యువతిని కత్తితో బెదిరించిన నలుగురు కామాంధులు ఆమె మీద కారులోనే సామూహిక అత్యాచారం చేశారు.

వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని వార్నింగ్
కారులోనే యువతి మీద నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీశారని ఆరోపలు ఉన్నాయి. గ్యాంగ్ రేప్ మ్యాటర్ బయటకు తెలిస్తే నిన్ను చంపేస్తామని, గ్యాంగ్ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని యువతికి వార్నింగ్ ఇచ్చారు. రాత్రి పొద్దుపోయిన తరువాత యువతిని ఆమె నివాసం ఉంటున్న ఈజీపురలో వదిలేసి వెళ్లిపోయారు.

యువతి దెబ్బకు మైండ్ బ్లాక్
యువతి ధైర్యం చేసి వివేక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ తో పాటు అతని స్నేహితుల స్కెచ్ మొత్తం రివర్స్ అయ్యింది. దీపు, అఖిలేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బెంగళూరులో యువతి మీద ఆమె స్నేహితులే గ్యాంగ్ రేప్ చెయ్యడం ఐటీ హబ్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications