బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: అధికార పార్టీ లీడర్ హత్య కేసులో ట్విస్ట్, ఐటీ హబ్ లో మరో ముగ్గురు అందర్, ఇంకా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలో బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు మరో మలుపుతిరిగింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసును మేము సాదారణ హత్య కేసుగా బావించడంలేదని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

Illegal affair: భార్య లేడీ టీచర్, ప్రియురాలు కాలేజ్ స్టూడెంట్, క్లైమాక్స్ లో భర్త పరిస్థితి ?, రివర్స్!Illegal affair: భార్య లేడీ టీచర్, ప్రియురాలు కాలేజ్ స్టూడెంట్, క్లైమాక్స్ లో భర్త పరిస్థితి ?, రివర్స్!

పక్కాస్కెచ్ తో అనుకున్న పని పూర్తి చేశారు

పక్కాస్కెచ్ తో అనుకున్న పని పూర్తి చేశారు

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లారే పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కొందరు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేసి వెంటాడి నరికి చంపేశారు.

ఇప్పటికే కొందరు

ఇప్పటికే కొందరు

కర్ణాటకను కుదిపేసిన బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో పోలీసులు కర్ణాటకలో ఇద్దరిని, కేరళలో ఒకరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్యకు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బీజేపీ నాయకుడి హత్య కేసుతో అనేక మందికి సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఎన్ఐఏ ఎంట్రీతో?

ఎన్ఐఏ ఎంట్రీతో?

బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లిపోయింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్ హత్య కేసులో పోలీసులు వారిపని వారు చేసుకుని వెలుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు. బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులో మరో ముగ్గురు అందర్

బెంగళూరులో మరో ముగ్గురు అందర్

బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో బెంగళూరులో మరో ముగ్గురిని సోమవారం అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. సయ్యద్ ఇర్ఫాన్, అల్తాఫ్ హుస్సేన్ తో పారు మరో నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో ఆ జిల్లాకు చెందిన ఇద్దరు, కేరళకు చెందిన ఓ వ్యక్తితో పాటు బెంగళూరులో మరో ముగ్గురు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రవీణ్ హత్య కేసులో ఇంకా కొందరి మీద అధికారులు నిఘా వేశారని తెలిసింది.

English summary
Leader: BJP leader Praveen murder case, three arrested in Bengaluru city in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X