బస్సు మీద నుంచి రూ. 500 నోట్లు విసిరేసిన ట్రబుల్ షూటర్, సీఎం అభ్యర్థి ఇలా చేస్తే ఎలా?, ఝలక్!
బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో నేనే కాబోయే ఎమ్మెల్యే అంటూ కొందరు నాయకులు ధీమాగా తిరిగేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద కేసు నమోదు అయ్యింది. బస్సు మీద నుంచి రూ. 500 నోట్లు విచ్చలవిడిగా ఎగరేశారని డీకే. శివకుమార్ మీద కేసు నమోదు అయ్యింది.
కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీని ఢీకొట్టాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అధికార పార్టీ బీజేపీకి ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ప్రజాధ్వని పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు.

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో డీకే. శివకుమార్ ప్రజాధ్వని పేరుతో బస్సుయాత్ర కోనసాగించారు. ఆ సందర్బంలో ర్యాలీలో పాల్గొన్న జానపద కళాకారుల మీద డీకే. శివకుమార్ రూ. 500 నోట్లు విసిరేశారు. బస్సు మీద నుంచి ప్రజల మీదకు. జానపద కళాకారుల మీదకు డీకే. శివకుమార్ రూ. 500 నోట్లు విసిరి వేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు.
ప్రముఖ జాతీయ మీడియా ఏఎన్ఐ ఈ వీడియోను మొదట బయటపెట్టడంతో వైరల్ అయ్యింది. తరువాత కన్నడ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అడ్డదారిలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని, తానే సీఎం అంటూ ప్రచారం చేసుకుంటున్న డీకే. శివకుమార్ పబ్లిక్ గా ప్రజలకు రూ. 500 నోట్లు విసిరేస్తున్నాడని ఆరోపిస్తూ బీజేపీ ఎంఎల్ సీ, ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ మండ్య జిల్లా ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణకు ఫిర్యాదు చేశారు.
డీకే. శివకుమార్ నగదు పంచుతున్నాడని కొన్ని సాక్షాలతో సహ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని, మండ్య గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని, అధికారులు విచారణ చేస్తున్నారని మండ్య జిల్లా ఎన్నికల అధికారి గోపాలక్రిస్ణ గురువారం మీడియాకు చెప్పారు. మొత్తం మీద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఒక పార్టీ నేతల మీద మరో పార్టీ నేతలు కేసులు పెట్టుకోవడం మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications