స్వతంత్ర పార్టీ మహిళా లీడర్ చేతిలో ఓడిపోయిన గాలి జనార్దన్ రెడ్డి అన్న!
బెంగళూరు/బళ్లారి: బళ్లారి రెడ్డి బ్రదర్స్ అంటే మైనింగ్ వ్యాపారంతో పాటు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్. కర్ణాటక రాజకీయాల్లో, బీజేపీలో బళ్లారి రెడ్డి బ్రదర్స్ చక్రం తిప్పారు. బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి చక్రం తిప్పి ఆయన అనుచరులు, మద్దతుదారులు గెలిపించుకున్నారు.
ఏరోజు అయితే అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లాడో ఆరోజు నుంచి బళ్లారి రెడ్డి బ్రదర్స్ కు బ్యాడ్ టైమ్ మొదలైయ్యింది. గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లిన తరువాత గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు బీజేపీలోనే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చేసినా ఆయన సోదరులు, శ్రీరాములు మాత్రం బీజేపీలోనే ఉన్నారు.

కర్ణాటక మంత్రిగా పని చేస్తున్న గాలి కరుణాకర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరప్పనహళ్లిలో మరోసారి పోటీ చేశారు. గాలి సోమశేఖర్ రెడ్డి బళ్లారి సిటీ నుంచి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ దెబ్బకు గాలి సోమశేఖర్ రెడ్డి ఓడిపోవడంతో బళ్లారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారా భరత్ రెడ్డి విజయం సాధించారు.
ఇక హరప్పనహళ్లిలో గాలి కరుణాకర్ రెడ్డి ఓడిపోయారు. హరప్పనహళ్లిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.పి, లతా చేతిలో ఓడిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. లతా ఎవరో కాదు, జేడీఎస్ పార్టీ సినియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎంపీ. ప్రశాష్ కుమార్తె. ఎంపీ. ప్రకాష్ మరణించిన తరువాత ఆయన కుమార్తె లతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వాలని లతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేశారు. చివరి నిమిషంలో లతాకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎన్ కోట్రోశ్రీకి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుతో విసిగిపోయిన లతా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
లతాను ఎన్నికల బరిలో నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెతో చర్చలు జరిపారు. అయితే లతా మాత్రం వెనక్కి తగ్గలేదు, లతాను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగానే బరిలోదిగిన లతా ప్రజల ముందుకు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గాలి కరుణాకర్ రెడ్డి మీద స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లతా భారీ మెజారిటీతో విజయం సాధించారు.
గాలి కరుణాకర్ రెడ్డికి 55, 690 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 44, 408 ఓట్లు వచ్చాయి. జేడీఎస్ పార్టీ అభ్యర్థి నూర్ అహమ్మద్ కు కేవలం 705 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లతాకు 69, 152 ఓట్లు రావడంతో మంత్రి గాలి కరుణాకర్ రెడ్డి మీద ఆమె భారీ మెజారిటీతోనే విజయం సాధించారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థి అయిన మహిళ చేతిలో గాలి కరుణాకర్ రెడ్డి ఓడిపోవడం ఇప్పుడు బళ్లారితో పాటు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
-
SPG కి షాక్ ఇచ్చిన ప్రధాని! ప్రోటోకాల్ బ్రేక్, మోదీ క్షమాపణలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications