ఆర్ టీసీ బస్సుల్లో ఫ్రీ, పండుగ రోజుల్లో మహిళలకు ప్రత్యేక బస్సులు, రెడ్డి ఆర్డర్!
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో శక్తి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి కొన్ని చోట్ల బస్సుల కొరతపై చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్‌పై బీజేపీ మండిపడుతోంది. ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు రావడంతో కేఎస్ఆర్ టీసీ మేనేజర్లతో కీలక సమావేశం నిర్వహించారు. కర్ణాటక రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి మంగళవారం కేఎస్ఆర్ టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
కేఎస్ఆర్ టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌తో సహ కేఎస్ఆర్ టీసీ కార్పొరేషన్‌లోని మొత్తం 16 డివిజన్‌లకు చెందిన డివిజనల్ కంట్రోలింగ్ అధికారులు, డివిజనల్ ట్రాఫిక్ అధికారులు మరియు 83 యూనిట్ మేనేజర్‌లతో మంత్రి రామలింగా రెడ్డి, కేఎస్ఆర్ టీసీ ఎండీ అన్బుకుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శక్తి పథకాన్ని మరింత సజావుగా సాగేలా చూడాలని మంత్రి రామలింగా రెడ్డి అధికారులకు చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న చర్యలపై అన్బుకుమార్ అధికారులతో కూలంకషంగా చర్చించి అవసరమైన సూచనలు చేశారు. రద్దీ మరియు పండుగ రోజుల గుర్తించి కేఎస్ఆర్ టీసీ అన్ని డివిజన్ల పరిధిలో రద్దీ ఎక్కువగా ఉండే 10 ప్రదేశాలను జాతరలు, పండుగలు వంటి ప్రత్యేక రోజుల విషయంలో ముందుగానే గుర్తించాలని సూచించారు.
ఆయా ప్రాంతాల్లో రద్దీని బట్టి అదనపు బస్సులను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి ప్రయత్నించాలని మంత్రి రామలిగా రెడ్డి ఆదేశించారు. దీని ద్వారా ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. అంతే కాకుండా టికెట్ పంపిణీ, రద్దీ ప్రాంతాలను గుర్తించిన చోట అదనపు సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్‌ను సులభతరం చేయాలి. ఈ విషయంలో అన్ని శాఖలు, యూనిట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని కర్ణాటక రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి అధికారులకు ఆదేశించారు.
రాబోయే రోజుల్లో శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం గురించి ఎటువంటి గందరగోళం మరియు సమస్య లేకుండా చూసుకోండి. ఏ కారణం చేతనైనా బస్సుల విస్తరణ, రవాణా వ్యవస్థలో జాప్యం, కొరత ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కేఎస్ఆర్ టీసీ అధికారులను మంత్రి రామలింగా రెడ్డి ఆదేశించారు. డ్రైవర్లు, కండెక్టర్లతో పాటు బస్సుల కోరతలేకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారులు, ఇన్‌చార్జ్ అధికారులు ప్రతి వారం తప్పకుండా విభాగాలను సందర్శించి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అదనపు ట్రిప్పులు బస్సులు నడపాలన్నారు. అదే సమయంలో శక్తి పథకం సక్రమంగా అమలు చేసేందుకు ప్రజలు కూడా కేఎస్ఆర్ టీసీతో చేతులు కలపాలని, అధికారులు, సిబ్బందికి సహకరించాలని మంత్రి రామలింగా రెడ్డి మహిళలకు విజ్ఞప్తి చేశారు.
జూన్ 11వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వ మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఆర్ టీసీ బస్సు ప్రయాణాన్ని అందించేందుకు శక్తి పథకాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన నాలుగు సంస్థల బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ప్రజల నుంచి ఊహించని స్పందన వస్తోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications