బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ACB: మాజీ మంత్రి, ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ఏసీబీ, ఇల్లు, గెస్ట్ హౌస్, అపార్ట్ మెంట్, ఆఫీసుల్లో, ఢిల్లీ దెబ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి.జడ్. జమీర్ అహమ్మద్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇంటి మీద, ఆయనకు చెందిన కార్యాలయాలు, అపార్ట్ మెంట్ ల మీద ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈడీ అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం వేకువ జామున ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి సోదాలు చేస్తున్నారు..ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించిన నివేదిక ఏసీబీ అధికారుల చేతికి చిక్కడంతో అధికారులు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఫూర్ బ్రాండ్ ఏమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు చుక్కలు చూపించడంతో ఆయన అనుచరులు హడలిపోయారు.

ADGP: ఎస్ఐ స్కామ్ కేసు, ఏడీజీపీ అరెస్టు, చరిత్రలో మొదటిసారి, ఐపీఎస్ అధికారి, గోవిందా గోవింద !ADGP: ఎస్ఐ స్కామ్ కేసు, ఏడీజీపీ అరెస్టు, చరిత్రలో మొదటిసారి, ఐపీఎస్ అధికారి, గోవిందా గోవింద !

ఈడీ అధికారుల దెబ్బ

ఈడీ అధికారుల దెబ్బ


కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ 2021 ఆగస్టు 5వ తేదీన బెంగళూరులోని ఆయన ఇంటి మీద, కార్యాలయాల మీద దాడులు చేసి సోదాలు చేశారు. అక్టోబర్ నెలలో జమీర్ అహమ్మద్ ఖాన్ కు నోటీసులు చేసిన ఈడీ అధికారులు న్యూఢిల్లీలోని కార్యాలయానికి పిలిపించి విచారణ చేసి వివరాలు సేకరించారు.

ఈడీ ఇచ్చిన సమాచారంతో షాక్

ఈడీ ఇచ్చిన సమాచారంతో షాక్

బెంగళూరులోని జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసి వివరాలు సేకరించిన ఈడీ అధికారులు తరువాత ఢిల్లీలోని కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించారు. జమీర్ అహమ్మద్ ఖాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు ఓ నివేదిక తయారు చేసి కర్ణాటక ఏసీబీ అధికారులకు సమర్పించారు.

 జమీర్ కు ఝలక్ ఇచ్చిన ఏసీబీ అధికారులు

జమీర్ కు ఝలక్ ఇచ్చిన ఏసీబీ అధికారులు

ఈడీ అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం వేకువ జామున బెంగళూరులోని జమీర్ అహమ్మద్ ఖాన్ కు చెందిన ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి సోదాలు చేస్తున్నారు..ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించిన నివేదిక ఏసీబీ అధికారుల చేతికి చిక్కడంతో అధికారులు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఫూర్ బ్రాండ్ ఏమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు చుక్కలు చూపించారు.

 ఇల్లు, అపార్ట్ మెంట్, గెస్ట్ హౌస్, ఆఫీసులు

ఇల్లు, అపార్ట్ మెంట్, గెస్ట్ హౌస్, ఆఫీసులు

ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి.జడ్. జమీర్ అహమ్మద్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన కంటోన్మెంట్ రైల్వేస్టేష్ సమీపంలోని ఇంటి మీద, సిల్వర్ ఓకే అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో, సదాశివనగర్ లోని ఆయన గెస్ట్ హౌస్, కలాసాపాళ్యలోని ఆయనకు చెందిన నేషనల్ ట్రావెల్స్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

ఇప్పుడే ఏమీ చెప్పలేము ఏసీబీ

ఇప్పుడే ఏమీ చెప్పలేము ఏసీబీ


జమీర్ అహమ్మద్ ఖాన్ కు చెందిన ఇల్లు, అపార్ట్ మెంట్, గెస్ట్ హౌస్, కార్యాలయాల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడుల విషయంలో వివరాలు ఇప్పుడే వెళ్లడించలేమని ఓ సీనియర్ ఏసీబీ అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు ఏసీబీ అధికారులు వేకువ జామున సినిమా చూపింయడంతో ఆయన ప్రత్యర్థి వర్గం నాయకులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.

English summary
MLA: Anti-Corruption Bureau of Karnataka raided the house and premises of Chamarajpet Congress Mla Zameer Ahmed Khan on June 5th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X