సర్వేతో షాక్, రాష్ట్రంలో అవినీతి ఎంత శాతం అంటే, బెంగళూరుకు ఎక్స్ ట్రాలు?

బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు సంస్థలు, మీడియా సంస్థుల సర్వేలు చేస్తున్నాయి. ప్రముఖ ఎన్ డీ టీవీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారు అని ప్రజల అభిప్రాయాలు సేకరించింది. కర్ణాటకలో ఐదేళ్లలో అవినీతి ఎక్కువ అయిపోయిందని 51 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.

లోక్ నీతి సెంటర్ ఫార్ ది స్టడి ఆఫ్ డెవలపింగ్ సోసైటీ (CSDS)తో కలిసి ఎన్ డీ టీవీ ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు కర్ణాటకలోని వివిద ప్రాంతాల్లో సంచరించి ప్రజల అభిప్రాయాలు సేకరించింది. మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారు అని సర్వేలో ఆరా తీశారు.

NDTV, CSDS Survey: Corruption has increased in Karnataka, public opinion about BJP government

కర్ణాటకలో యువతకు నిరుద్యోగ సమస్య ఎక్కువ అయ్యిందని 28 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. గ్రామీణ కర్ణాటక ప్రాంతాల్లో పేదరికం తాండవం చేస్తుందని, ఏ ప్రభుత్వాలు పేద ప్రజలను పట్టించుకోవడం లేదని 25 శాతంమంది అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.

గత ఐదు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చులు, ధరలు ఎక్కువ అయ్యాయని, వాటి వలన తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 67 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ఇక కర్ణాటకలో 40 శాతం కమీషన్ బీజేపీ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ పదేపదే చేస్తున్న ఆరోపణల మీద ప్రజలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

NDTV, CSDS Survey: Corruption has increased in Karnataka, public opinion about BJP government

గత ఐదు ఏళ్లలో కర్ణాటకలో అవినీతి తాండవం చేస్తోందని, ఏ పనిజరగాలన్నా లంచం ఇవ్వాలని, లంచం ఇవ్వకపోతే పనులు జరడంలేదని 51 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ప్రభుత్వాలు మారినా అవినీతి మాత్రం ఏమాత్రం తగ్గడంలేదని 35 శాతం మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.

2018-19 ఎన్నికల తరువాత అవినీతి పెరిగిపోయిందని 41 శాతం బీజేపీ మద్దతుదారులు అసహనం వ్యక్తం చేశారని సర్వే వివరించింది. ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేసి లింగాయత్, ఒక్కలిగులకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీజేపీని వ్యతిరేకిస్తున్న చాలా మంది తప్పుబట్టారని, వారు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని సర్వే తెలిపింది.

NDTV, CSDS Survey: Corruption has increased in Karnataka, public opinion about BJP government

టప్పుసుల్తాన్ ను ఒక్కలిగ నాయకుడు ఉరిగౌడ నంజేగౌడ అంతం చేశారనే అనే విషయంలో ఇది మతఘర్షణలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని, అందుకే ఇలా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే వివరించింది. అయితే లింగాయత్, ఒక్కలిగుల రిజర్వేషన్లు బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా, కొంప ముంచుతుందా అని ప్రజలు సరైన సమాధానం చెప్పడం లేదని తెలిసింది.

ఉత్తర కర్ణాటకకు అన్యాయం చేస్తూ బెంగళూరుకు మాత్రమే అధిక ప్రధాన్యత ఇస్తూ నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నారని 41 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో 27 శాతం మంది, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పనితీరుతో 24 శాంతం మంది మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తూ మేము సంతోషంగానే ఉంటున్నామని చెప్పారని సర్వే వివరించింది.

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో 36 శాతం మంది పర్వాలేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద 42 శాతం మంది పర్వాలేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. అయితే కర్ణాటకలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అని మాత్రం సర్వే వివరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+