Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల్లో గెలిచేదెవరు - ముఖ్యమంత్రిగా మద్దతెవరికి..!!

ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి ఫోకస్ కర్ణాటకపైనే ఉంది. అక్కడ గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ - బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కానీ, ప్రజలు తమతోనే ఉన్నారని జేడీఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సమయం లో అక్కడ గెలిచేదెవరు. కింగ్ ఎవరు..కింగ్ మేకర్ ఎవరు. ఇదే అంశం పైన 'పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ‌ నిర్వహించిన సర్వేలో ఆసక్తి కర అంవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే లో కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు ఈ సారి కూడా ఏ పార్టీకీ లభించడంలేదని తేలింది. మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని స్పష్టం అవుతోంది.

రెండు పార్టీలు విఫలం..:సర్వే నివేదికల ప్రకారం హోరాహోరి పోరులో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పాలక బీజేపీపై కొంతమేర పైచేయి సాధిస్తుందని స్పష్టమవుతోంది. భారత్‌ జోడో యాత్ర ప్రభావంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మెజార్టీ సాధిస్తుందని ప్రచారం జరిగినా, అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

రాహుల్‌ భారత జోడో యాత్ర ప్రభావం, ఇదే రాష్ట్రం నుంచి మల్లికార్జున్‌ ఖర్గేను పార్టీ అఖిల భారత అధ్యక్షుడుగా చేసిన పరిణామ ప్రభావం.... కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల శ్రేణులు ఆశించిన స్థాయిలో ప్రజాక్షేత్రంలో లేదని తెలుస్తోంది. సర్వే ఫలితాల్ని బట్టి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

 karnatakaelections

సర్వే జరిగిందిలా..ఫలితం ఇలా:'ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ' (పీపీఎస్‌) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 5600 శాంపిల్స్‌ సేకరించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో కొంత మొగ్గు ఈ సర్వేలో కనిపించింది. కాంగ్రెస్‌ 98 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచే అవకాశాలున్నాయి. సర్వేలో ఆ పార్టీకి 95-105 స్థానాలు వస్తాయని తేలింది. బీజేపీకి 92 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి.

ఆ పార్టీకి 90-100 సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఈ సర్వేలో వెల్లడయిన అంశాలను బట్టి చూస్తే రాష్ట్రంలో హోరాహోరీ పోటీ తప్పదనిపిస్తోంది. 27 సీట్లతో జేడీ (ఎస్‌) మరోమారు కీలకపాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ 25-30 సీట్లు గెలవవచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే మరోమారు 2018లో వచ్చినట్టు హంగ్‌ ఫలితాలు పునరావృత్తమవడం ఖాయంగా కనిపిస్తోంది.

 karnatakaelections

ముఖ్యమంత్రిగా మద్దతెవరికి..:ఇదే సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఉందనే అంశం పైన అభిప్రాయ సేకరణ చేసారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సానుకూలంగా 32 శాతం మంది స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి బి.యడియురప్పకు 25 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకి 20 శాతం మద్దతివ్వగా, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 18 శాతం, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు 5 శాతం మంది మద్దతిచ్చారు.

కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని భావిస్తున్నారన్న ప్రశ్నకు, కాంగ్రెస్‌ అని 42 శాతం, బీజేపీ అని 38 శాతం, జేడీ (ఎస్‌) అని 14 శాతం మంది స్పందించారు. సామాజిక - ఈ మధ్య కాలంలో లేవనెత్తిన సున్నిత అంశాలు..పార్టీల విధానాలను సర్వేలో విశ్లేషించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ కర్ణాటకలో హంగ్ ఖాయమనే అంచనాలను వ్యక్తం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+