Plan: రెడ్డి ఇంటిలో జంట హత్యలు. తిన్నింటివాసాలు లెక్క పెట్టిన జగదీష్, అనంతపురంలో ఉంటే?
బెంగళూరు/అనంతపురం: బెంగళూరులోని కోరమంగల రెండవ స్టేజ్ లో రాజగోపాల్ రెడ్డి అనే ప్రముఖ వ్యాపారవేత్త నివాసం ఉంటున్నారు. కర్ణాటకలోని దావణగెరెకి చెందిన కరియప్ప 30 ఏళ్ల నుంచి వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో పని చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన బంధువులు అందరూ కరియప్పకు బాగా పరిచయం ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి అలియాస్ గోపాల్ రెడ్డి ఇంటిలో బహుదూర్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.
రాజ్ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో అనంతపురం వెళ్లిన సమయంలో ఆయన ఇంటిలో పని చేస్తున్న కరియప్ప, సెక్యూరిటీ గార్డు బహుదూర్ దారుణ హత్యకు గురైనారు. జంట హత్యల కేసులో ముగ్గురు అరెస్టు అయ్యారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వాడే జంట హత్యలు చేశాడని వెలుగు చూసింది.

అందరివాడు
బెంగళూరులోని కోరమంగల రెండవ స్టేజ్ లో రాజగోపాల్ రెడ్డి అనే ప్రముఖ వ్యాపారవేత్త నివాసం ఉంటున్నారు. కర్ణాటకలోని దావణగెరెకి చెందిన కరియప్ప రాజగోపాల్ రెడ్డి ఇంటిలో పని చేస్తున్నాడు. అసోంకు చెందిన బహుదూర్ అనే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాడు.

అనంతపురం వెళ్లిన రెడ్డి
వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో పని చెయ్యడానికి ఆడవాళ్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యాపారి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం వెళ్లాడు. ఇంట్లోనే ఉండాలని రాజగోపాల్ రెడ్డి కరియప్పకు చెప్పాడు. కరియప్ప, బహదూర్ రాజగోపాల్ రెడ్డి ఇంటికి కాపలా ఉన్నారు.

ఇద్దరిని చంపేశారు
శనివారం అర్దరాత్రి కొందరు నిందితులు గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు బహదూర్ మీద దాడి చేసి తని నోటిలో బట్టలు కుక్కి అతని కాళ్లు చేతులు కట్టేసి నీటి సంప్ లో సెక్యూరిటీ గార్డు బహదూర్ ను వేసి పై మూత మూసేసి హత్య చేశారు. ఇంట్లో ఉన్న కరియప్పను దారుణంగా చంపేసిన నిందితులు ఇల్లు లూటీ చేసి వెళ్లిపోయారు.

మాజీ కారు డ్రైవర్
రాజగోపాల్ రెడ్డి ఇంటిలో జరిగిన కరియప్ప, బహదూర్ జంట హత్యల వెనుక ఏం జరిగింది ? అని పోలీసులు ఆరా తీశారు. వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ గురించి పూర్తి సమాచారం తెలిసిన వాళ్లు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు అని తెలిసిన వాళ్లే కరియప్ప, బహదూర్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు ఆరా తీస్తే రాజగోపాల్ రెడ్డి మాజీ కారు డ్రైవర్ జగదీష్ తెరమీదకు వచ్చాడు.

పక్కా సమాచారంతో
రాజగోపాల్ రెడ్డి దగ్గర రెండు నెలల క్రితం వరకు జగదీష్ కారు డ్రైవర్ గా పని చేశాడు. జగదీష్ తీరుతో విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి రెండు నెలల క్రితం అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. మాజీ యజమాని రాజగోపాల్ రెడ్డి ఆర్థిక లావాదేవీల గురించి, ఆయన ఎక్కవు బయటకు ఊర్లకు తిరుగుతాడని జగదీష్ కు బాగా తెలుసు.

ఫ్రెండ్స్ తో కలిసి జంట హత్యలు
రాజగోపాల్ రెడ్డి ఆనంతపురం వెళ్లాడని తెలుసుకున్న కారు డ్రైవర్ జగదీష్ అతని స్నేహితులు కిరణ్, అభిషేక్ తో కలిసి అతని ఇంటికి వెళ్లి కరియప్ప, బహదూర్ ను హత్య చేసి నగదు, నగలు లూటీ చేశారని పోలీసులు అన్నారు. జంట హత్యల కేసులో కారు డ్రైవర్ జగదీష్. కిరణ్, అభిషేక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కోరమంగల పోలీసులు తెలిపారు.
-
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications