Wife: భార్యను చంపేసి నీట్ గా నీటి సంప్ లో వేసి మూతపెట్టిన భర్త, అసలు సమస్యతో ఇబ్బందిపడి ?

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఉన్న ఇద్దరు కుమార్తెలకు వివాహం అయ్యింది. వివాహం అయిన తరువాత కుమార్తెలు వారి అత్తారింటికి వెళ్లి వారి భర్తలతో సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు మాత్రమే నివాసం ఉంటున్నారు. భార్య నిర్మాణంలో ఉన్న కట్టడంలో శవమై కనిపించింది.

బెంగళూరు సిటీలోని తలఘట్టపురలో శంకరప్ప (60), శివమ్మ (50) దంపతులు నివాసం ఉంటున్నారు. శంకరప్ప, శివమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శంకరప్ప, శివమ్మ దంపతుల కుమార్తెలు పెళ్లి చేసుకుని బెంగళూరు పిటీకి దూరంగా ఉంటున్న వారి అత్తారింటికి వెళ్లి వారి భర్తలతో సంతోషంగా కాపురం చేస్తున్నారు.

Problems: Husband killed his no possession of limbs wife in Bengaluru city in Karnataka.

శంకరప్ప సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శంకరప్ప భార్య శివమ్మ అనారోగ్యానికి గురైయ్యింది. రానురాను శివమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తరువాత శివమ్మ చెయ్యి, కాలు పని చెయ్యకపోవడంతో ఆమె మంచానికే పరిమితం అయ్యింది. భార్య శివమ్మకు ఆమె భర్త శంకరప్ప అన్ని పనులు చేస్తున్నాడు.

శివమ్మ మలమూత్రాలు తీస్తున్న శంకరప్ప ఆమెకు అప్పుడప్పుడు స్నానం చేయిస్తూ భోజనం తినిపిస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి శంకరప్ప అతని భార్య శివమ్మకు సపర్యలు చేస్తున్నాడు. ప్రతిరోజు సెక్యూరిటీ గార్డుగా పని చెయ్యడం, ఇంటికి వెళ్లి భార్య శివమ్మకు సేవలు చెయ్యలేక శంకరప్ప సతమతం అయ్యాడు.

తాను ఇలాంటి పనుల నుంచి విముక్తికావాలంటే ఏదో ఒకటి చెయ్యాలని శంకరప్ప అనుకున్నాడు. రాత్రి ఇంటికి వెళ్లి మంచం పట్టిన భార్య శివమ్మను ఎత్తుకుని వెళ్లి నిర్మాణంలో ఉన్న కట్టడంలోని నీటి సంపులో వేసి హత్య చేశాడు. మరుసటి రోజు భవన నిర్మాణ కార్మికులు వెళ్లి చూడగా శివమ్మ హత్యకు గురైన వియయం వెలుగు చూసింది. తన భార్య శివమ్మను తానే హత్య చేశానని శంకరప్ప అంగీకరించాడని తలఘట్టపుర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+