Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi: అధికారం మాదే, బీజేపీని ఇంటికి పంపిస్తాము, లీడర్స్ ధీమా, మైసూరులో రాహుల్ ఎంట్రీ!

బెంగళూరు/మైసూరు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో అడుగు పెట్టడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ధీమాగా చెబుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో 511 కిలోమీటర్లు రూట్ మ్యాప్ తో రాహుల్ గాంధీ పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు. మైసూరు దసరా ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే ఆ జిల్లాలో శనివారం రాహుల్ గాంధీ అడుగుపెట్టారు.

రాహుల్ గాంధీ ఎంట్రీ

రాహుల్ గాంధీ ఎంట్రీ

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శుక్రవారం తమిళనాడు నుంచి కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలో కర్ణాటకలో పాదయాత్ర మొదలుపెట్టారు. గుండ్లుపేట, నంజనగూడు, మైసూరు, మండ్య జిల్లాలలోని పాండవపుర, మేలుకోటే మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగడానికి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం సిద్దరామయ్య రాహుల్ గాంధీ వెంట పాదయాత్ర చేస్తున్నారు.

మూడు విడతలు

మూడు విడతలు

మేలుకోటే నుంచి రంగనాథపరం నుంచి చిత్రదుర్గ జిల్లాలో రాహుల్ గాంధీ పాద్రయాత్ర కొనసాగుతుంది. 7 లోక్ సభ నియోజక వర్గాలు, 20 శాసన సభ నియోజక వర్గాల్లో మూడు విడతలుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. కర్ణాటకలో 511 కిలోమీటర్లు రూట్ మ్యాప్ తో రాహుల్ గాంధీ పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు.

అధికారం మాదే

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో అడుగు పెట్టడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ధీమాగా చెబుతున్నారు వచ్చే శాసన సభ ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించి ఎవరి మద్దతు లేకుండా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

బళ్లారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర

బళ్లారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర

రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా హీరేహాల్ లోని ఓబుళాపురం నుంచి హలకుండి, బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలవనున్నారు. బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ తరువాత మూడో విడతలో భాగంగా రాయచూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాయచూరు నుంచి దేవసూగూరు నుంచి వికారాబాద్ లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ తరువాత తెలంగాణలో పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+