బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Revenge: గిరిజన మహిళను అర్డనగ్నంగా చేసి చితకబాదేసిన అధికార పార్టీ లీడర్ అండ్ కో, అసలు మ్యాటర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న రెండు కుటుంబాల మద్య ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా, కుల పెద్దలు రాజీలు చేసినా వాళ్ల పంచాయితీలు మాత్రం కొలిక్కిరాలేదు. ఇంటి స్థలం విషయంలో గొడవలు పడుతున్న వారిలో గిరిజన కుటుంబానికి చెందిన మహిళ ఉంది. తనకు అన్యాయం జరుగుతోందని, పక్కింటి వాళ్లు ఇంటి స్థలం విషయంలో గొడవలు చేస్తున్నారని గిరిజన మహిళ పోలీసులను, సంబంధింత రెవెన్యూ శాఖా అధికారులను ఆశ్రయించింది.

పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఇంటి స్థలం వివాదం పరిష్కరించడానికి సంఘటనా స్థలానికి చేరుకుని స్థలం వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించారు. మీ గొడవ పరిష్కరించడం మావల్లకాదు అంటూ అధికారులు చేతులు ఎత్తేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో పక్కింటి కుటుంబ సభ్యులు, అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కలిసి గిరిజన మహిళ బట్టలు చింపేసి అర్దనగ్నంగా చేసి చితకబాదేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బీజేపీ నాయకుడితో పాటు కొందరు మహిళలతో సహ మొత్తం 9 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Shock: అక్కా అంటూ వెంట తిరిగాడు, 17 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి, షాక్ లో ఫ్యామిలీ!Shock: అక్కా అంటూ వెంట తిరిగాడు, 17 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి, షాక్ లో ఫ్యామిలీ!

ఇంటి స్థలం వివాదంతో

ఇంటి స్థలం వివాదంతో

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలుకాలోని గురిపళ్ళ (మంగళూరు సమీపంలో) చాలా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో రెండు కుటుంబాల మద్య ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా, కుల పెద్దలు రాజీలు చేసినా వాళ్ల పంచాయితీలు మాత్రం కొలిక్కిరాలేదు.

అన్యాయం జరిగిందని మహిళ ఆరోపణ

అన్యాయం జరిగిందని మహిళ ఆరోపణ

ఇంటి స్థలం విషయంలో గొడవలు పడుతున్న వారిలో గిరిజన కుటుంబానికి చెందిన మహిళ ఉంది. తనకు అన్యాయం జరుగుతోందని, పక్కింటి వాళ్లు ఇంటి స్థలం విషయంలో గొడవలు చేస్తున్నారని గిరిజన మహిళ పోలీసులను, సంబంధింత రెవెన్యూ శాఖా అధికారులను ఆశ్రయించింది.

చేతులు ఎత్తేసిన పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు

చేతులు ఎత్తేసిన పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు

పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఇంటి స్థలం వివాదం పరిష్కరించడానికి సంఘటనా స్థలానికి చేరుకుని స్థలం వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే ఈ స్థలం మాదే అంటే మాదే అంటూ రెండు వైపుల వాళ్లు అక్కడే గొడవపడ్డారు. మీ గొడవ పరిష్కరించడం మావల్లకాదు, మీరు కోర్టులో తేల్చుకోండి అంటూ అధికారులు చేతులు ఎత్తేసి వెళ్లిపోయారు.

బీజేపీ నాయుడి మీద కేసు నమోదు

బీజేపీ నాయుడి మీద కేసు నమోదు

ఇదే సమయంలో పక్కింటి కుటుంబ సభ్యులు, అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, బీజేపీ ఎస్ టీ మోర్చ అధ్యక్షుడు కలిసి గిరిజన మహిళ బట్టలు చింపేసి అర్దనగ్నంగా చేసి చితకబాదేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బీజేపీ నాయకుడితో పాటు సందీప్, గులాబి, సంతోష్, కుసుమ, సుగుణ, లోకయ్య, అనిల్, చెన్నకేశవ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుడి మీద ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అందరిని అరెస్టు చేసిన బెళ్తంగడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మమ్మల్ని కావాలనే టార్చర్ పెడుతున్నారని బాధితురాలి సోదరి ఆరోపిస్తున్నది.

English summary
Revenge: Belthangady police arrested BJP leader and 9 other in connection with the attack on tribal woman near Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X