Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: భార్య మీద డౌట్, ప్రియుడు ఉన్నాడని ?, చేతిలో కర్ఫూరం పెట్టి ?, నువ్వు పతివ్రత అయితే!

బెంగళూరు/కోలారు/కేజీఎఫ్: వివాహం చేసుకున్న వ్యక్తితో అతని భార్య కాపురం చేస్తోంది. చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. కొన్ని సంవత్సరాలు భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త తరువాత ఆమె తీరుపై అనుమానం పెంచుకున్నాడు. రానురాను భార్య మీద విపరీతంగా అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చితకబాదుతున్నాడు. భార్య మొబైల్ ఫోన్ లో ఎవరితోనైనా మాట్లాడినా, ఇంటి నుంచి బయటకు వెళ్లినా, అంగడికి వెళ్లి నిత్యవసర వస్తువులు తెచ్చుకున్నా సరే భార్యను ఆమె భర్త అనుమానిస్తున్నాడు.

భర్త ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆమె ఓర్పుతో అతని ఆగడాలను ఓర్చుకుంటూ జీవిస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య శీలంపై అనుమానంతో ఆమెను చితకబాదేశాడు. నేను ఏ తప్పు చెయ్యలేదని అతని భార్య కుయ్యోమొర్రో అంటూ అతని కాళ్లు పట్టుకుంది. చివరికి నువ్వు పతివ్రతవు అయితే నేను చెప్పినట్లు చెయ్యాలని భార్యకు చెప్పాడు. గడ్డ కర్ఫూరం తీసుకుని భార్య చేతిలో పెట్టాడు. నేను నీ చేతిలో ఉన్న కర్ఫూరం వెలిగిస్తానని, నీకు కాలిన గాయలు కాకపోతే నువ్వు పతివ్రతవి, చెయ్యి కాలితే నువ్వు పతివ్రత కాదు అని చెప్పి ఆమె చేతిలో ఉన్న గడ్డ కర్ఫూరం వెలిగించాడు.

చేతిలో కర్ఫూరంకు మంటలు వ్యాపించి భార్యకు మంటలు వ్యాపించి ఆమె చేతులు బొబ్బలు పోయాయి. భర్త ఆగడాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తరువాత తన మీద ప్రతికారం తీర్చుకుంటాడని భార్య సైలెంట్ గా ఉండిపోయింది. చేతులకు తీవ్రగాయాలైన భార్యను ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చివరికి మ్యాటర్ పోలీసులకు తెలిసిపోవడంతో భర్త పరారైనాడు. కంప్యూటర్ కాలంలో భార్య శీలంపై అనుమానంతో రామాయణం సీన్ రిపిట్ చేసిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

14 ఏళ్ల క్రితం పెళ్లి

14 ఏళ్ల క్రితం పెళ్లి

కర్ణాటకలోని కోలారు జిల్లా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లోని వేమ్ గల్ సమీపంలోని వీరేనహళ్ళి గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 14 సంవత్సరాల క్రితం ఆనంద్ పెద్దలు సెట్ చేసిన చైత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆనంద్ ను వివాహం చేసుకున్న చైత్రా ఆమె భర్తతో కాపురం చేస్తోంది.

భార్య మీద అనుమానం మొదలైయ్యింది

భార్య మీద అనుమానం మొదలైయ్యింది

కొన్ని సంవత్సరాలు భార్య చైత్రాతో సంతోషంగా కాపురం చేసిన ఆమె భర్త ఆనంద్ తరువాత ఆమె తీరుపై అనుమానం పెంచుకున్నాడు. రానురాను భార్య చైత్రా మీద విపరీతంగా అనుమానం పెంచుకున్న ఆనంద్ ఇంటికి వెళ్లి ఏదో ఒక వియంలో ఆమెతో గొడవ పెట్టుకుని ఆమెను చితకబాదుతున్నాడు.

ప్రతి విషయానికి భార్య మీద అనుమానమే

ప్రతి విషయానికి భార్య మీద అనుమానమే

భార్య చైత్రా మొబైల్ ఫోన్ లో ఎవరితోనైనా మాట్లాడినా, ఇంటి నుంచి బయటకు వెళ్లినా, అంగడికి వెళ్లి నిత్యవసర వస్తువులు తెచ్చుకున్నా సరే ఆమె భర్త ఆనంద్ అనుమానిస్తున్నాడు. భర్త ఆనంద్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నా చైత్రా మాత్రం ఓర్పుతో అతని ఆగడాలను ఓర్చుకుంటూ జీవిస్తోంది.

మద్యం మత్తులో ఇంటికి వెళ్లి

మద్యం మత్తులో ఇంటికి వెళ్లి

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆనంద్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య చైత్రా శీలంపై అనుమానంతో ఆమెను చితకబాదేశాడు. నేను ఏ తప్పు చెయ్యలేదని చైత్రా ఆమె భర్త ఆనంద్ ముందు కుయ్యోమొర్రో అంటూ అతని కాళ్లు పట్టుకుని నన్ను కొట్టకూడదని వేడుకుంది.

భార్య చేతిలో కర్ఫూరం పెట్టి వెలిగించిన భర్త

భార్య చేతిలో కర్ఫూరం పెట్టి వెలిగించిన భర్త

చివరికి నువ్వు పతివ్రతవు అయితే నేను చెప్పినట్లు చెయ్యాలని ఆనంద్ అతని భార్య చైత్రాకుకు చెప్పాడు. గడ్డ కర్ఫూరం తీసుకుని భార్య చైత్రా చేతిలో పెట్టాడు. నేను నీ చేతిలో ఉన్న కర్ఫూరం వెలిగిస్తానని, నీకు కాలిన గాయలు కాకపోతే నువ్వు పతివ్రతవి, చెయ్యి కాలితే నువ్వు పతివ్రత కాదు అని చెప్పిన ఆనంద్ ఆమె చేతిలో ఉన్న గడ్డ కర్ఫూరంకు నిప్పు అంటించాడు.

కంప్యూటర్ కాలంలో రామాయణం స్కెచ్ వేసిన భర్త ఎస్కేప్

కంప్యూటర్ కాలంలో రామాయణం స్కెచ్ వేసిన భర్త ఎస్కేప్

చేతిలో కర్ఫూరంకు మంటలు వ్యాపించి భార్య చైత్రా చేతికి మంటలు వ్యాపించి ఆమె చేతులకు బొబ్బలు వచ్చేశాయి. భర్త ఆనంద్ ఆగడాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తరువాత తన మీద ప్రతికారం తీర్చుకుంటాడని అతని భార్య చైత్రా సైలెంట్ గా ఉండిపోయింది.

చేతులకు తీవ్రగాయాలైన భార్య చైత్రాను ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చివరికి మ్యాటర్ పోలీసులకు తెలిసిపోవడంతో చైత్రా భర్త ఆనంద్ పరారైనాడు. కంప్యూటర్ కాలంలో భార్య శీలంపై అనుమానంతో రామాయణం సీన్ రిపిట్ చేసిన ఆనంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+