Sadist: అమ్మ రెండో మొగుడు, కూతురు ఒంటరిగా చిక్కిందని, నిన్న తల్లి, నేడు కూతురు !

బెంగళూరు: బాలిక తల్లిని రెండో పెళ్లి చేసుకున్న శాడిస్టు ఆమె మొదటి భర్త కూతురి మీద కన్ను వేశాడు. రెండో భర్త కారణంగా తల్లి అయిన మహిళ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల బాలిక మీద ఆమె తల్లి రెండో భర్త పదేపదే అత్యాచారం చేశాడు. విషయం బయటకు తెలిస్తే నిన్ను, మీ అమ్మను చంపేస్తానని వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యింది. నిన్న రెండో భార్యను తల్లిని చేసిన కామాంధుడు ఇప్పుడు ఆమె కూతురిని తల్లిని చేశాడు.

భర్తతో విడాకులు

భర్తతో విడాకులు


ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని సంపిగేహళ్ళిలో నివాసం ఉంటున్న రజియా (పేరు మార్చడం జరిగింది) ఇంతకు ముందే వివాహం అయ్యింది. రజియాకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. నిత్యం గొడవలు జరడంతో విసిగిపోయిన భర్త రజియాకు విడాకులు ఇచ్చేశాడు. భర్తతో తెగతెంపులు చేసుకున్న రజియా కుమార్తెతో కలిసి వేరుగా ఉంటోంది.

 బాలిక తల్లి రెండో పెళ్లి

బాలిక తల్లి రెండో పెళ్లి

ఆర్.కే.హెగ్డే నగర్ లో నివాసం ఉంటున్న మోహమ్మద్ షబ్బీర్ (32) అనే యువకుడు రజియాను రెండో పెళ్లి చేసుకున్నాడు. రిజయా, మోహహ్మద్ షబ్బీర్ ఆర్ కే హెగ్డే నగర్ లో కాపురం ఉంటున్నారు. మోహమ్మద్ షబ్బీర్ తో పాటు రజియా రెండో కుమార్తె ఉంటున్నది. రజియాను రెండో పెళ్లి చేసుకున్న మోహమ్మద్ షబ్బీర్ వరుసకు కూతురు అయ్యే 15 ఏళ్ల బాలిక మీద కన్ను వేశాడు.

కాన్ఫు కోసం భార్య ఆసుపత్రిలో

కాన్ఫు కోసం భార్య ఆసుపత్రిలో


రెండో భర్త మోహమ్మద్ షబ్బీర్ తో కాపురం చెయ్యడంతో రజియా గర్బవతి అయ్యింది. గత ఏడాది జూన్ లో కాన్ఫు కోసం ఆమె సంపిగేహళ్ళిలోని ఓ ఆసుపత్రిలో చేరింది. భార్య రజియా ఆసుపత్రిలో ఉన్న సమయంలో రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల బాలిక మీద ఆమె తల్లి రెండో మొగుడు అత్యాచారం చేశాడు.

 చంపేస్తానని బెదిరించి

చంపేస్తానని బెదిరించి

ఆసుపత్రి నుంచి మీ అమ్మ ఇంటికి వచ్చిన తరువాత తాను రేప్ చేశానని చెబితే నిన్ను, మీ అమ్మను, పుట్టిన బిడ్డను చంపేస్తానని కామాంధుడు మోహమ్మద్ షబ్బీర్ బాలికను బెదిరించాడు. ప్రాణభయంతో బాలిక ఈ విషయం ఆమె తల్లి రజియాకు చెప్పలేదు. అప్పటి నుంచి చాన్స్ చిక్కినప్పుడు అంతా బాలిక మీద కామాంధుడు మోహమ్మద్ షబ్బీర్ అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.

Recommended Video

    2020 Recap : Celebrities Who Married In Corona Crisis | Oneindia Telugu
    రెండో మొగుడి దెబ్బకు తల్లికి షాక్

    రెండో మొగుడి దెబ్బకు తల్లికి షాక్


    బాలిక ఇటీవల పదేపదే అనారోగ్యానికి గురైయ్యింది. బాలిక కడుపు ఎత్తుగా వస్తుండటంతో ఆమె తల్లి రజియాకు అనుమానం వచ్చి ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లింది. బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లి రజియా షాక్ కు గురైయ్యింది. ఎవరు చేశారు ఈ పని అని ప్రశ్నించడంతో కూతురు జరిగిన విషయం మొత్తం చెప్పింది. తన భర్త కూతురిని గర్బవతిని చేశాడని తెలుసుకున్న రజియా నేరుగా వెళ్లి సంపిగేహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కూతురిని గర్బవతిని చేసిన కిరాతకుడు మోహమ్మద్ షబ్బీర్ ను అరెస్టు చేసి అతని నరాలు పిండేసి జైలుకు పంపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+