Delivery boy: వాట్సాప్ లో టీ షర్ట్ కోడ్, డెలవరీ బాయ్ ఏం డెలవరీ చేస్తున్నాడో తెలుసా ?, క్రిమినల్!
బెంగళూరు: బెంగళూరు నగరంలో కొన్ని వేల మంది ఫుడ్ డెలవరీ బాయ్స్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పలు సంస్థల పేరుతో ఉన్న టీ షర్టులు వేసుకున్న డెలవరీ బాయ్స్ ఫుడ్ డెలవరీ చేస్తున్నారు. ఐటీ హబ్ లో ఎక్కడా చూసినా, ఏటైమ్ లో అయినా రోడ్ల మీద డెలవరీ బాయ్స్ దర్శనం ఇస్తుంటారు. పోలీసులు డెలవరీ బాయ్స్ వేసుకునే టీషర్ట్ వేసుకుని వెలుతున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడు ఇచ్చిన సమాచారంతో అందరూ షాక్ అయ్యారు. ఫుడ్ డెలవరీ బాయ్ ముసుగులో ఆ యువకుడు ఏం సరఫరా చేస్తున్నాడో తెలుసుకున్న సామాన్య ప్రజలు, డెలవరీ బాయ్స్ షాక్ అయ్యారు.

వేల సంఖ్యలో డెలవరీ బాయ్స్
బెంగళూరు నగరంలో కొన్ని వేల మంది ఫుడ్ డెలవరీ బాయ్స్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పలు సంస్థల పేరుతో ఉన్న టీ షర్టులు వేసుకున్న డెలవరీ బాయ్స్ ఫుడ్ డెలవరీ చేస్తున్నారు. ఐటీ హబ్ లో ఎక్కడా చూసినా, ఏటైమ్ లో అయినా రోడ్ల మీద డెలవరీ బాయ్స్ దర్శనం ఇస్తుంటారు.

మిజోరం టూ బెంగళూరు
బెంగళూరులోని బెళ్లందూరు సమీపంలో డెలవరీ బాయ్ టీ షర్టు వేసుకుని వెలుతున్న యువకుడిని బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిజోరమ్ కు చెందిన డేవిడ్ అనే యువకుడిని పోలీసులు విచారణ చేశారు. డేవిడ్ దగ్గర రూ. 3 లక్షలకు పైగా విలువైన గంజాయి ఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సెంట్రల్ జైలుకు వెళ్లాడు
ఐదు సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకున్న డేవిడ్ మొదట ఫుట్ పాత్ మీద చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగించాడు. హోటల్ కు వచ్చి వెళ్లే గంజాయి డీలర్స్ తో పరిచయం పెంచుకున్న డేవిడ్ త్వరగా డబ్బు సంపాధించాలని ఆశపడ్డాడు. గంజాయి విక్రయిస్తూ అరెస్టు అయిన డేవిడ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లాడు.

కేరళ పోటుగాడితో డీలింగ్
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కేరళకు చెందిన డ్రగ్స్ డీలర్ పరిచయం అయ్యాడు. డేవిడ్ జైలు నుంచి విడుదల కావడానికి కేరళ వ్యక్తి సహాయం చేశాడు. జైలు నుంచి విడుదలైన తరువాత కేరళ వ్యక్తి చెప్పినట్లు డెలవరీ బాయ్ ముసుగులో డేవిడ్ గంజాయి సరఫరా చేస్తున్నాడని పోలీసులు అన్నాడు. కేరళ వ్యక్తి, డేవిడ్, గంజాయి కొనుగోలు చేసేవాళ్లు టీసర్ట్ కోడ్ వాట్సాప్ లో షేర్ చేసుకుని ఇంతకాలం గంజాయి చేతులు మార్చుకుంటున్నారని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications