రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు: పలువురికి గాయాలు, ఉగ్రదాడేనా?
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో శుక్రవారం భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
Bengaluru Blast: Rameshwaram Cafe Incident Leaves 8 Injured; Bomb Squad on Scene#Bengaluru #Bangalore #BengaluruDaily #Rameshwaram #RameshwaramCafe https://t.co/toyNJZ7eJl pic.twitter.com/quKVo0WMH7
— Oneindia News (@Oneindia) March 1, 2024
కాగా, ఓ వ్యక్తి కస్టమర్‌లా వచ్చి రెస్టారెంట్‌లో బ్యాగ్ పెట్టి వెళ్లిపోయాడని.. అనంతరం అది పేలిందని సమాచారం. ఈ ఘటన బాంబు పేలుడు కారణంగానే సంభవించిందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు రెస్టారెంట్ యజమానితో మాట్లాడినట్లు తెలిపారు.

'రామేశ్వరం కేఫ్ యజమాని శ్రీనాగరాజ్‌తో పేలుడు గురించి మాట్లాడాను. కస్టమర్ వదిలేసిన బ్యాగ్ వల్ల పేలుడు సంభవించిందని.. సిలిండర్ పేలుడు సంభవించలేదని ఆయన నాకు చెప్పారు. వారి ఉద్యోగి ఒకరు గాయపడ్డారు. ఇది స్పష్టంగా బాంబు పేలుడు కేసు. సీఎం సిద్ధరామయ్య నుంచి దీనిపై స్పష్టమైన సమాధానం రావాలని బెంగళూరు కోరుతోంది' అని ట్విట్టర్ వేదికగా టేజస్వీ సూర్య పేర్కొన్నారు.
#WATCH | Karnataka | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited.
— ANI (@ANI) March 1, 2024
Whitefield Fire Station says, "We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing… pic.twitter.com/uMLnMFoHIm

ఎప్పుడూ కస్టమర్లతో రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించడంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడ్నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. కాగా, ఈ పేలుడు ఉగ్రదాడే అనుమానలు వ్యక్తమవుతున్నాయి.
Just spoke to Rameshwaram Café founder Sri Nagaraj about the blast in his restaurant.
— Tejasvi Surya (@Tejasvi_Surya) March 1, 2024
He informed me that the blast occurred because of a bag that was left by a customer and not any cylinder explosion. One of their employees is injured.
It’s seems to be a clear case of bomb…
బాంబు దాడే: సీఎం సిద్ధరామయ్య
CCTV footage of blast in Rameshwaram Cafe in Bengaluru. pic.twitter.com/NDSkpKvzkx
— Anshul Saxena (@AskAnshul) March 1, 2024
రామేశ్వరం కేఫ్‌లో బాంబు దాడే జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్ వదిలేసినట్లుగా కనిపించిందని.. ఆ బ్యాగే పేలుడుకు కారణమైనట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోంమంత్రి సంఘటనా స్థలానికి వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేలుడు సంభవించిందని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications