సీఎం మీద అనర్హత వేటు వెయ్యాలని హైకోర్టును ఆశ్రయించిన శంకర్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, వరుణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధరామయ్యపై అనర్హత వేటు వేయాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే ఏడాది మే 20వ తేదీన సిద్ధరామయ్య రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం సిద్దరామయ్య మీద ఎమ్మెల్యే పదవి వేటు వెయ్యాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించకముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీలను ఇచ్చింది. అలాగే హామీ కార్డులపై కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే. శివకుమార్, సిద్ధరామయ్య సంతకాలు చేసి ఇచ్చారు. దీని ఆధారంగా కోర్టును ఆశ్రయించారు. సిద్ధరామయ్య ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు వేయాలని కోరుతూ శంకర్ అనే వ్యక్తి శుక్రవారం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జులై 28వ తేదీన కోర్టు విచారించనుంది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన 1, 19, 816 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి వి. సోమన్న ఓడించి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
కానీ ఈ ఎన్నికల్లో ఆయన తన నియోజకవర్గాన్ని మార్చుకుని మైసూరులోని వరుణ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సిద్ధరామయ్య శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ మే 2న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
అయితే అంతకు ముందు ఆ పార్టీ ప్రజలకు 5 హామీలు ఇచ్చింది. డీకే. శివకుమార్, సిద్ధరామయ్య సంతకాలు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 5 ఉచిత హామీల అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించారు.
స్రీశక్తి, గృహలక్ష్మి, గృహజ్యోతి సహా మూడు హామీలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, అన్నభాగ్య, శక్తి అనే 5 హామీలను ఇచ్చింది. ప్రజలు కూడా హామీలను నమ్మి కాంగ్రెస్‌ను ఆదరించి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
-
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
దేశంలోని ఈ అడవుల్లో పర్యటిస్తే మాటల్లో చెప్పలేని అనుభూతి..! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు!












Click it and Unblock the Notifications