Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sister in law: తమ్ముడి భార్య తల పగలగొట్టిన బావ. ఎందరు చెప్పినా మాట మాత్రం వినలేదు!

బెంగళూరు/ యాదగిరి: అన్నదమ్ములు పెళ్లి కాకముందు వరకు కలసిమెలసి స్నేహితుల్లా జీవించారు. తరువాత అన్నకు వివాహం అయ్యింది. కొన్ని సంవత్సరాలకు తమ్ముడికి పెళ్లి జరిగింది. ఎవరి భార్యలతో వాళ్లు సంతోషంగా జీవించారు. భార్యలు వచ్చిన తరువాత అన్నదమ్ములు వేర్వేరు కాపురాలు పెట్టారు. భార్యలతో కాపురాలు చేస్తున్న అన్నదమ్ములు బయట సంతోషంగానే ఉన్నారు.

అయితే ఒక్క వియంలో అన్నదమ్ముల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. తరువాత చాలా జరిగాయి. అన్న అతని తమ్ముడి భార్య తల పలగొట్టడంతో ఆమె ఆసుపత్రిలో ఐసీయూలో ఉంది.

అన్నదమ్ములు

అన్నదమ్ములు

కర్ణాటకలోని యాదగిరి జిల్లా హుణసగి తాలుకాలోని కల్లదేనహళ్లి గ్రామంలో ప్రకాష్, అతని తమ్ముడు గురునాథ్ నివాసం ఉంటున్నారు. ప్రకాష్ అతని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వేరేగా నివాసం ఉంటున్నాడు. గురునాథ్ అతని భార్య నాగరత్న, పిల్లలతో కలిసి అదే గ్రామంలో వేరుగా నివాసం ఉంటున్నాడు.

డోంట్ కేర్ అంటున్న అన్న

డోంట్ కేర్ అంటున్న అన్న

కొంతకాలంగా ఆస్తి పంపకాల వియషయంలో ప్రకాష్, గురునాథ్ ల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు నచ్చచెప్పి ఆస్తి పంచుకోవాలని చూసించినా ప్రకాష్ మాత్రం అతను చెప్పినట్లు వినాలని అంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. న్యాయంగా ఆస్తి పంపకాలు జరగాలి పెద్దలు, బంధువులు చెప్పినా ప్రకాష్ మాత్రం ఎవ్వరిని లెక్క చెయ్యలేదని తెలిసింది.

బావ మాట ఏమాత్రం లెక్క చెయ్యని మరదలు

బావ మాట ఏమాత్రం లెక్క చెయ్యని మరదలు

అన్న ప్రకాష్ కోరికలను అతని తమ్ముడు గురునాథ్, అతని భార్య నాగరత్న వ్యతిరేకించారు. నేను చెప్పినట్లు వినాలని ప్రకాష్ ఇంతకు ముందే కొన్ని సార్లు తమ్ముడు గురునాథ్, మరదలు నాగరత్నను హెచ్చరించాడు. అయితే గురునాథ్, నాగరత్న దంపతులు మాత్రం ప్రకాష్ చెప్పినట్లు ఏమాత్రం వినలేదు.

మరదలి మీద ఇనుపరాడ్ తో దాడి

మరదలి మీద ఇనుపరాడ్ తో దాడి

ఇదే విషయంలో రగిలిపోయిన ప్రకాష్ ఇనుపరాడ్ తీసుకుని తమ్ముడు గురునాథ్, మరదలు నాగరత్న మీద దాడి చేశాడు. నాగరత్న తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను యాదగిరి జిల్లా ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరదలు నాగరత్న మీద దాడి చేసిన ప్రకాష్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+