దైవదర్శనం చేసుకుని వెలుతుంటే ఆర్ టీసీ బస్సు ఢీకొని దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు!
బెంగళూరు: స్నేహితులు అందరూ ఎక్కడికి వెళ్లాలన్నా కలిసి వెళ్లి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కాకుండా స్నేహితులు మాత్రం ప్రత్యేకంగా దైవదర్శనాలకు, విహారయాత్రలకు వెళ్లి వస్తున్నారు. ఉదయం అందరూ దేవుడి దర్శనం కోసం కారులో వెళ్లారు. దేవుడి దర్శనం చేసుకుని కారులో ఇంటికి వెలుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అందరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
బెంగళూరు నగర శివార్లలోని చందాపురలో గోవింద్, కుమార్, నాగేష్, పుట్టరాజు. జ్యోతిలింగప్ప (కారు యజమాని) తదితరులు నివాసం ఉంటున్నారు. సోమవారం శ్రావణమాసంలోని చివరి సోమవారం కావడంతో అందరూ పుణ్యక్షేత్రానికి వెళ్లాలని ఆదివారం మాట్లాడుకున్నారు. మైసూరు సమీపంలోని మలేమహదేశ్వర బెట్టకు వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలని అనుకున్నారు.

మహదేశ్వర బెట్టకు వెళ్లాలని మాట్లాడుకున్న స్నేహితులు అందరూ సోమవారం ఉదయం జ్యోతిలింగప్పకు చెందిన క్వాలీస్ కారులో గుడికి బయలుదేరారు. ఇదే కారులో కారు యజమాని కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులకు తాము దేవాలయానికి వెలుతున్నామని చెప్పి సోమవారం ఉదయం చందాపుర నుంచి అందరూ సంతోషంగా బయలుదేరి వెళ్లారు. మలేమహదేశ్వర బెట్టకు వెళ్లి స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేసి తరువాత కారులో ఇంటికి బయలుదేరారు.
సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కనకపుర సమీపంలోని శాతనూరు నుంచి మైసూరు వెలుతున్న కేఎస్ఆర్ టీసీ బస్సు వేగంగా వచ్చి క్వాలీస్ కారును ఢీకొనింది. ఈ ప్రమాదంలో క్వాలిస్ వాహనంలో ఉన్న ఆరు మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. కేఎస్ఆర్ టీసీ బస్సు డ్రైవర్ తో పాటు బస్సులో ఉన్న వారికి గాయాలు కావడంతో బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. కేవలం కొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంటికి చేరుకోవాలసిన స్నేహితులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆరు కుటుంబాల్లో విషాదచాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications