బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Son effect: యడియూరప్ప పదవికి ఎసరు, సూపర్ సీఎంగా, కరోనా కరుణించినా కొడుకు కనికరించలేదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో మూడు నెలల ముందు లాక్ డౌన్ దెబ్బతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు పూర్తిగా మూసి వేశారు. అలాంటి సమయంలో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప కొడుకు హొదాలో దేవాలయం తలుపులు తీపించిన బీవై. విజయేంద్ర భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చెయ్యడం యడియూరప్పకు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టింది. కర్ణాటక సీనియర్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బళ్లారి శ్రీరాములు పీఏని గత నెలలో అరెస్టు చేపించిన విజయేంద్ర తండ్రి యడియూరప్పను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేశారు. అనేక విషయాల్లో జోక్యం చేసుకోవడం, లేనిపోని పెత్తనాలు చెయ్యడం యడియూరప్పను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించడానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆయన కుమారుడు బీవై. విజయేంద్ర కారణం అయ్యాడని యడియూరప్ప వర్గీయులు, కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. ఇంతకాలం యడియూరప్ప సీఎం అయితే ఆయన కొడుకు విజయేంద్ర సూపర్ సీఎంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు, యడియూరప్ప వ్యతిరేక వర్గం మండిపడిన విషయం తెలిసిందే.

BSY vs July: జులై వస్తే ఈ సీఎంకు చలి, జ్వరం, బలవంతంగా రాజీనామాలు, ఆషాడమాసం ఆఫర్ !BSY vs July: జులై వస్తే ఈ సీఎంకు చలి, జ్వరం, బలవంతంగా రాజీనామాలు, ఆషాడమాసం ఆఫర్ !

రంజాన్ కు కనికరించలేదు

రంజాన్ కు కనికరించలేదు

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో ప్రముఖ ఆలయాలు, ప్రార్థనా మందిరాలు పూర్తిగా మూసివేశారు. ఈ ఏడాది రంజాన్ పండుగను ముస్లీం సోదరులు వారివారి ఇళ్లలోనే జరుపుకున్నారు. నాలుగు నెలల క్రితం కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ దెబ్బతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు పూర్తిగా మూసి వేశారు. అర్చకులు మాత్రమే ఆలయంలో దీపం వెలిగించి దేవుడికి నైవేద్యం పెట్టి తలుపులు మూసేసి వెళ్లిపోయారు. భక్తులు దేవాలయం బయట నుంచి భగవంతుడికి నమస్కారం చేసుకుని వెనుతిరిగారు.

ఆ రోజు యడియూరప్ప కొడుకు ఏం చేశారంటే ?

ఆ రోజు యడియూరప్ప కొడుకు ఏం చేశారంటే ?


కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ప్రసిద్ది చెందిన శ్రీ నంజనగూడు శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం ఉంది. లాక్ డౌన్ దెబ్బతో శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం తలుపులు మూసి వేసి భక్తులను ఆలయం లోపలికి అనుమంతించడంలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఉపాధ్యక్షుడు బివై. విజయేంద్ర శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం అధికారి రవీంద్రకు నచ్చచెప్పి 2021 మే 18వ తేదీన గుడి తలుపులు తీపించారు.

భార్యతో కలిసి పూజలు

భార్యతో కలిసి పూజలు

నంగజనగూడులోని శ్రీకంఠేశ్వర ఆలయం తలుపులు తీపించిన సీఎం బీఎస్. యడియూరప్ప కొడుకు బివై. విజయేంద్ర ఆయన భార్యతో కలిసి సుమారు అర్దగంటకు పైగా ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఇదే సమయంలో సీఎం కొడుకు విజేయంద్రకు భద్రత కల్పిస్తున్న 8 మంది గన్ మ్యాన్ లు కూడా విజయేంద్ర దంపతుల వెంట ఆలయంలోకి వెళ్లారని వెలుగు చూడటంతో అప్పట్లో ప్రతిపక్షాలు సీఎం యడియూరప్ప కొడుకు విజయేంద్ర తీరుపై మండిపడ్డారు.

 కొడుకు తో అప్పకు ఇబ్బందులు

కొడుకు తో అప్పకు ఇబ్బందులు

శ్రీకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం బీఎస్. యడియూరప్ప కొడుకు విజయేంద్ర దంపతులు నేరుగా కపిలా నది తీరంలోకి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి నదీ తీరంలో గంగాదేవికి బాగినం సమర్పించారు. సీఎం కొడుకు హోదాలో విజయేంద్ర దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ రోజు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టలేక బీఎస్. యడియూరప్ప, ఆయన వర్గీయులు నానాతంటాలు పడ్డారు.

శ్రీరాములు పీఏ అరెస్టు......బళ్లారి రచ్చరచ్చ

శ్రీరాములు పీఏ అరెస్టు......బళ్లారి రచ్చరచ్చ


బీఎస్. యడియూరప్పను సీఎం కుర్చీలో కుర్చోపెట్టడానికి బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్, బళ్లారి శ్రీరాములు ఎన్ని ప్రయత్నాలు చేశారో కొత్తగా చెప్పనవసరం లేదు. తండ్రిని సీఎం కుర్చీలో కుర్చోపెట్టడానికి ఆరోజు పూర్తిగా సహకరించిన బళ్లారి శ్రీరాములు పీఏని గత నెలలో యడియూరప్ప కొడుకు బీవై. విజయేంద్ర అరెస్టు చేపించడం కలకలం రేపింది. ఆ సమయంలో బళ్లారి శ్రీరాములు అసహనం వ్యక్తం చేశారు.

సూపర్ సీఎం అని విమర్శలు

సూపర్ సీఎం అని విమర్శలు

రెండు సంవత్సరాల క్రితం 2019 జులై 26వ తేదీన యడియూరప్ప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండు మూడు నెలల ముందు వరకు ఆయన కొడుకు విజయేంద్ర సూపర్ సీఎంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య అయితే ఎన్నోసార్లు విజయేంద్ర సూపర్ సీఎం అంటూ విమర్శలు చేశారో అనే విషయం లెక్కేలేదు.

కరోనా కరుణించినా కొడుకు కనికరించలేదు

కరోనా కరుణించినా కొడుకు కనికరించలేదు

కరోనా వైరస్ ను అరికట్టడానికి యడియూరప్ప శక్తి వంచనలేకుండా పని చేశారని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పింది. యడియూరప్ప రెండుసార్లు కరోనాను జయించారు. కరోనా వైరస్ కరుణించినా యడియూరప్పకు మీద ఆయన కొడుకు విజయేంద్రకు కణికరం లేకుండాపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. యడియూరప్పకు వయసుతో పాటు ఆయన కొడుకు సమస్యగా మారడంతో ఆయన సీఎం పదవి కి ఎసరు వచ్చింది.

English summary
Karnataka CM Yediyurappa son BY Vijayendra visited the Nanjanagud temple in violation of the Lockdown rules in Mysuru in 2021 May 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X