అబ్బా భలే డీల్ చేసిన ఎస్ఐ, డ్రైవర్ తో కలిసి కారులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా
బెంగళూరు/హావేరి: ఏసీబీ నుంచి అధికారాలు మొత్తం లోకాయుక్త పోలీసుల చేతికి వెళ్లిపోవడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అడ్డదిడ్డంగా లంచాలు తీసుకుంటున్న అధికారులు కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్నారు. ఇక పోలీసు శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు అయితే వారు ఆడింది ఆటగా పాడిందిపాటగా తయారైయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా లంచగొండితనాన్ని అరికట్టేందుకు పనిచేస్తున్న లోకాయుక్త పోలీసులు మరోసారి పోలీసుల మీదే పంజా విసిరారు. కర్ణాటకలోని రాణేబెన్నూర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ రూ. 40 వేలు లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసు అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిపోయాడు.

రాణేబెన్నూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సునీల్, అతని వాహనం డ్రైవర్ సచిన్ మంగళవారం లోకాయుక్త అధికారుల వలలో పడ్డారు. ఎస్ఐ సునీల్. అతని కారు డ్రైవర్ సచిన్ స్వయంగా అడ్వాన్స్ గా రూ. 40 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో హవేరి లోకాయుక్త అధికారులు వల పన్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రాణేబెన్నూరు టౌన్ లో నివాసం ఉంటున్న ఫిరోజ్ అతని ఇంటి అద్దె వసూలు చేసే వియంలో పంచాయితీలు జరిగాయి, ఇంటి అద్దెలు వసూలు చేసుకోవడానికి రూ. 50 వేలు లంచం ఇవ్వాలని సబ్ ఇన్‌స్పెక్టర్ సునీల్ డిమాండ్ చేశాడు. అయితే ఇంత మొత్తంలో లంచం ఇవ్వలేనని, కాస్త తగ్గించాలని ఫిరోజ్ పోలీసులను అభ్యర్థించారు. అప్పుడు లంచం డబ్బు రూ. 50 వేల నుంచి రూ. 40 వేలకు తగ్గింది. ఆ తర్వాత ఎస్‌ఐ, అతని కారు డ్రైవర్ ఒప్పందం ప్రకారం రూ. 40వేలు లంచం తీసుకుంటుండగా నిందితులు లోకాయుక్త వలలో పడ్డారు.












Click it and Unblock the Notifications