Swamiji: మురుగా, ఎంతపని చేశావయ్యా ?, అమ్మాయిల కేసులో స్వామీజీకి, రశ్మీ మేడమ్ కు నో బెయిల్, ఢమాల్!
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలోని మురుగా మఠానికి చెందిన అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రదుర్గాకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమ్మాయిల లైంగిక దాడి కేసులో బెయిల్ తీసుకుని బయటకు రావాలని ప్రయత్నాలు చేసిన మురుగా మఠం శివమూర్తి మురుగా శరణరు స్వామీజీని రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మైనర్ అమ్మాయిలను?
కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల ప్రజల దగ్గర ఇంతకాలం మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు శివమూర్తి మురగా శరణరు మామీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు పెట్టడం ఇటీవల కర్ణాటకలో కలకలం రేపింది.

స్వామీజీ ఏం చెప్పారు?
చిత్రదుర్గా మురుగా మఠానికి చెందిన విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు చిత్రదుర్గా జిల్లా జైలుకు పంపించారు. కోర్టు అనుమతితో శివమూర్తి మురుగా స్వామీజీని పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారణ చేసి వివరాలు సేకరించారు. అయితే పోలీసుల విచారణలో శివమూర్తి మురుగా శరణరు ఏం చెప్పారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

అమ్మాయిలు సేఫ్
లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు వచ్చిన మురుగా మఠం ఆధీనంలోని అక్కమ్మదేవి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయిలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మురుగా మఠానికి చెందిన హాస్టల్ లో నివాసం ఉంటూ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అమ్మాయిలు అందరిని హాస్టల్ లో నుంచి ఖాళీ చేయించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు సురక్షితంగా ఉన్నారు.

బెయిల్ కోసం స్వామీజీ మనవి
ఇప్పటికే శివమూర్తి మురుగా శరణరు అరెస్టు కావడంతో ఆయన రిమాండ్ అవది బుధవారంతో పూర్తి అయ్యింది. బుధవారం భారీబందోబస్తు మద్య స్వామీజీని చిత్రదుర్గ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని శివమూర్తి మురుగా శరణరు కోర్టుకు మనవి చేశారు.

స్వామీజీ, రశ్మీ మేడమ్ కు నో బెయిల్
శివమూర్తి మురుగా శరణరును 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని చిత్రదుర్గా జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఏ2 ఆరోపి, హాస్టల్ వార్డెన్ రశ్మీకి సెప్టెంబర్ 27వ వరకు జ్యూడీషియల్ కస్టడీ పొడగించారు. ఇదే కేసులో నాలుగవ ఆరోపి, మఠం కార్యదర్శి మరమశివయ్య, 5వ ఆరోపి న్యాయవాది గంగాధరయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications