బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ATM: డబ్బు కాదు.. ఏకంగా ఏటీఎం యంత్రాన్నిఎత్తుకెళ్లారు.. ఎక్కడంటే..

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఏటీఎంలో దొంగతనం అంటే ఏటీఎంలోని డబ్బులు ఎత్తుకెళ్తారు. అయితే ఏటీఎం పగలగొట్టి డబ్బులు తీసుకోవడానికి టైమ్ తీసుకోవడంతోపాటు కాస్త ఇబ్బంది ఉంటుంది అదే ఏటీఎంనే ఎత్తుకెళ్తే.. అవును అదే పని చేశారు ఓ చోటు. కర్ణాటకలోని బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్‌లో పరారయ్యారు.

డిసెంబర్ 10న

డిసెంబర్ 10న

హరళూరు రోడ్డు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎం కేంద్రంలోకి డిసెంబర్ 10న అర్ధరాత్రి 2.30 సమయంలో ఏటీఎం కేంద్రంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించారు. అప్పటికే బయట సిద్ధంగా ఉంచుకున్న వాహనంలో పారిపోయారు. తర్వాత రోజు ఉదయం స్థానికులు డబ్బులు విత్ డ్రా చేయడానికి ఏటీఎం కేంద్రానికి రాగా అందులో ఏటీఎం లేదు. పైగా అందులో ఫ్లోరింగ్ పగలగొట్టినట్లుగా ఉంది. దీంతో వారు బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చారు.

ఏటీఎం

ఏటీఎం

ఏటీఎం కేంద్రానికి చేరుకున్న అధికారులు ఏటీఎం ఎత్తికెళ్లినట్లు గుర్తించారు. వెంటనే బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

కెమెరాపై రంగు

కెమెరాపై రంగు

త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్థానిక డీసీపీ గిరీష్‌ తెలిపారు. ట్రక్‌తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాపై రంగును స్ప్రే చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎం బయట ఉన్న కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు ఎటువైపు వెళ్లారనేది తెలుసుకుంటున్నామని చెప్పారు.

ఎంత డబ్బు

ఎంత డబ్బు

ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్‌లో పెట్టుకుని పోయిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఏటీఎం మిషన్ లో ఎంత డబ్బు ఉందో తెలియరాలేదు.

English summary
The miscreants broke into the ATM center under the Bellandur Police Station in Karnataka and took the ATM machine and escaped in a container.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X