teacher: ఎంత కావాలో అంత టార్చర్ పెట్టారు, తహసిల్దార్ ఆఫీసులో హెడ్ మాస్టర్ ?, డెత్ నోట్ లో!
టీచర్ కు హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వచ్చింది. తరువాత అక్కడే ఆ టీచర్ అసలు కథ మొదలైయ్యింది. ఆ హెడ్ మాస్టర్ తహసిల్దార్ ఆఫీసు కార్యాలయం ఆవరణంలో శవమై కనిపించాడు. డెత్ నోట్ లో మ్యాటర్ ?
బెంగళూరు/విజయపురం: వివాహం చేసుకున్న వ్యక్తి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. టీచర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. కొంతకాలం తరవాత టీచర్ కు హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వచ్చింది. తరువాత అక్కడ ఆ టీచర్ అసలు కథ మొదలైయ్యింది. ఉద్యోగం చేస్తున్న స్కూల్ లోని టీచర్లు, బీఇఓ, ఎంఇవో ఇలా విద్యాశాఖాలో ఉన్న కొంత మందితో అన్ని రకాలుగా అక్కడా ఇక్కడా పంచాయితీలు జరగడంతో హెడ్ మాస్టర్ తహసిల్దార్ ఆఫీసు కార్యాలయం ఆవరణంలో శవమై కనిపించాడు.
కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని సిందగి తాలూకాలోని ససాబా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బసవరాజ్ (55) విజయపూర్ జిల్లా సిందగి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్మ చేసుకోవడం కలకలం రేపింది. తనను మానసికంగా హింసించారని లేఖ రాసిన ప్రధానోపాధ్యయుడు బసవరాజ్ తోటి ఉపాధ్యాయులతో పాటు గ్రామ నాయకులపై ఆరోపణలు చేసి డెత్ నోట్ రాయడం కలకలం రేపింది.

సాటి ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని వారి పేర్లు, ఎలా వేధింపులకు గురి చేశారు అని డెత్ నోట్ లో రాసిన హెడ్ మాస్టర్ బసవరాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఎల్. భజంత్రి, సిందగి, బీఈవో, సీఆర్‌పీ జీఎన్ పాటిల్ చిత్రహింసలే తన ఆత్మహత్యకు కారణమని హెడ్ మాస్టర్ బసవరాజ్ ఆయన రాసిన డెత్ నోట్‌లో పేర్కొన్నారు.
గ్రామానికి చెందిన సంగమేశం నుంచి కొందరు అధికారులు లంచం తీసుకుని మింగేశారని, సంగమేష్‌ల నుంచి డబ్బులు తీసుకుని అతని ద్వారా తన మీద విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయించారని, మధ్యాహ్నాం భోజనం పథకం కింద మాకు సక్రమంగా ఆహారం అందడం లేదని పిల్లలు ఫిర్యాదు చేశారని వీళ్లు కట్టుకథలు అల్లి తన మీద ఫిర్యాదు చేశారని, అందరూ కలిసి డబ్బులు దోచుకుంటూ నిందలు మాత్రం తన మీద వేస్తున్నారని డెత్ నోట్ రాసిన హెడ్ మాస్టర్ బసవరాజ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. హెడ్ మాస్టర్ బసవరాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications