Cooker bomb: బెంగళూరుకు మారిన దర్యాప్తు, షారిక్ కు గుడ్ మార్నింగ్ చెప్పిన ఎన్ఐఏ, ఇక్కడే!
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో ఆటోలో జరిగిన పేలుడులో పోలీసులకు అనేక సాక్షాలు చిక్కాయి. నిందితుడు మోహమ్మద్ షారిక్ అలియాస్ షారిఖ్ కుక్కర్ బాంబు పేలుడులో గాయపడి మంగళూరులోని ఫాదర్ ముల్లర్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
అంతకు ముందే షారిక్ కుక్కర్ బాంబుతో నిలబడి మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పటికే పోలీసుల చేతికి చిక్కాయి. షారిక్ మంగళూరులో బాంబు పేలుళ్లకు స్కెచ్ వేశాడని వెలుగు చూసింది. కుక్కర్ బాంబుతో నిలబడిన నిందితుడు షారిఖ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి తీసుకున్న ఫోటోలు అతని ఇంటిలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళూరులో బాంబు పేలుడు జరపడానికి మైసూరులోనే మోహమ్మద్ షారిఖ్ కుక్కర్ బాంబు తయారు చేసి దానిని మంగళూరు తీసుకు వచ్చాడని అధికారులు అంటున్నారు. అయితే షారిఖ్ స్కెచ్ విఫలమై ముందుగానే ఆ కుక్కర్ బాంబు ఆటోలో పేలిపోయిందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిందితుడు షారిఖ్ తో పాటు అతని ముగ్గురు బంధువుల ఇళ్లల్లో ఇప్పటికే పోలీసులు సోదాలు చేసి ఆధారాలు సేకరించారు.
మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు ఇప్పటికే ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు. ఇన్ని రోజులు మంగళూరులోని ఫాదర్ ముల్లార్ ఆసుపత్రిలో బాంబు పేలుడు నిందితుడు షారిక్ ను ఎన్ఐఏ అధికారులు విచారణ చేశారు. కుక్కర్ బాంబు పేలుడు నిందితుడు షారిక్ కోలుకోవడంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

వైద్యుల సలహామేరకు కుక్కర్ బాంబు పేలుడు నిందితుడు షారిక్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు శనివారం ఉదయం మంగళూరు నుంచి బెంగళూరుకు బయలుదేరారని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ శశికుమార్ మీడియాకు చెప్పారు. శనివారం బెంగళూరు చేరుకున్న తరువాత కుక్కర్ బాంబు నిందితుడు షారిక్ కు ఎన్ఐఏ అధికారులు బెండ్ తీసి మ్యాటర్ మొత్తం బయటకు లాగాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications