నరేష్ - పవిత్ర ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ : మైసూర్ హోటళ్లో ప్రత్యక్షం - రమ్య ఎంట్రీతో అక్కడ..!!
నరేశ్-పవిత్రా లోకేశ్.. ప్రస్తుతం హట్ టాపిక్ గా మారిన పేర్లు ఇవి. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సంబంధం..పెళ్లి చేసుకుంటున్నారంటూ జరుగుతన్న చర్చల నేపథ్యంలో తాజాగా భారీ ట్విస్టు చోటు చేసుకుంది. ఈ ఇద్దరు మైసూరులోని ఒక హోటల్ లో సడన్ గా దర్శనమిచ్చారు. ఒక హోటల్ లో ఈ ఇద్దరు కనిపించటం ఒక షాక్ అయితే..అంతలోనే అక్కడకు రయ్య ఎంటర్ అయ్యారు.
ఈ ఇద్దరినీ చూస్తూనే మండి పడ్డారు. తనకు విడాకు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటారంటూ నిలదీసారు. పవిత్ర పైన అందరి సమక్షంలోనే చెప్పుతో దాడికి ప్రయత్నించారు. ఇంతలో పోలీసుల ఎంట్రీతో అక్కడ గొడవను అడ్డుకున్నారు.

నరేశ్ - పవిత్ర లోకేష్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్
కొద్ది రోజులుగా నరేష్ - పవిత్ర తో పాటుగా మాజీ భార్య ఒకరి పైన మరొకరు విస్తుపోయే నిజాలు చెబుతూ వచ్చారు. నరేశ్-పవిత్రా.. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో జంటగా నటించారు. అయితే గత నాలుగేళ్లుగా ఈ జంట సహజీవనం చేస్తున్నారని, వివాహం చేసుకోబోతున్నారని కొద్ది రోజుల నుంచి ప్రచరాం సాగుతోంది. నరేశ్-పవిత్రా ఇద్దరు పలు ప్రైవేట్ ఈవెంట్లతో పాటు గుడి గోపురాలను సందర్శించారు. నరేశ్ - పవిత్ర సంబంధం పైన చర్చ జరుగుతున్న సమయంలోనే నరేశ్ భార్య రమ్య రఘుపతి స్పందించారు. నరేశ్ తో తనకు సత్సంబంధాలు లేవని స్పష్టం చేసారు.

మైసూరు హోటల్ లో ప్రత్యక్షం
తనకు ఇప్పటి వరకు విడాకులు ఇవ్వలేదన్నారు. నరేశ్ కు మరో వివాహం జరిగితే తన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నరేశ్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. తనకు అందిన లీగల్ నోటీసుల పైన చర్చిస్తున్నానని చెప్పుకొచ్చారు. రమ్య రఘుపతి చేసిన ఆరోపణలను నటుడు నరేశ్ ఖండించారు. వాటిల్లో ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పారు.
తాను ఏ రకంగానూ రమ్యతో సంబంధాలు కొనసాగించటం లేదని స్పష్టం చేసారు. తనను రూ 50 లక్షల కోసం ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. విడాకుల నోటీసులు పంపాని చెప్పారు. ఈ వివాదంలోకి పవిత్రా లోకేశ్ ను తీసుకొచ్చి రూమర్లు మొదలు పెట్టారని వివరించారు. రమ్య రఘుపతి చేసిన మోసాలు, బ్లాక్ మెయిల్ అవమానకరంగా మారాయన్నారు.

దాడికి రమ్య ప్రయత్నం - పోలీసుల ఎంట్రీ
తనకు నాలుగు పెళ్లిళ్లు అయి ఉండొచ్చని...వాళ్లే తనను వదిలి వెళ్లిపోయారని చెప్పపుకొచ్చారు. రమ్య మాత్రం తన జీవితం నాశనం చేసారంటూ ఆరోపించారు. పవిత్రా లోకేశ్ సైతం ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఏదైనా ఉంటే కుటుంబ సభ్యుల సమక్షంలో తేల్చుకోవాలని సూచించారు. నరేశ్ మంచి వ్యక్తి అంటూ..ఎలాంటి దాపరికాలు లేవని చెప్పుకొచ్చారు. తనకు - నరేశ్ కు అందరి మద్దతు కావాలంటూ వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు మైసూరు హోటల్ లో వీరిద్దరూ ప్రత్యక్షం అవ్వటం.. నరేశ్ విజిల్స్ వేయటం.. రమ్య డాడికి ప్రయత్నించారనే సమచారంతో ఈ వ్యవహారం పీక్ కు చేరింది.












Click it and Unblock the Notifications