Girl: రాత్రి బస్ స్టాండ్ లో అమ్మాయికి ఏం చెప్పారు ?, బయటకు పిలుచుకుని వెళ్లి?, సీసీటీవీల్లో?
బెంగళూరు/విజయపుర: కర్ణాటకలోని విజయపుర నగరంలోని బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న యువతికి మాయమాటలు చెప్పిన యువకులు బయటకు పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేశారు.విజయపుర నగరంలోని సెంట్రల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న యువతిని ముగ్గురు యువకులు ఆమెను నమ్మించి సెంట్రల్ బస్టాండ్ నుండి బయటకు తీసుకెళ్లారు.
అనంతరం నగరంలోని శాటిలైట్ బస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు అక్కడ ఎవరూ లేని విషయాన్ని గమనించి యువతిని భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక యువకుడు మాత్రమే అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడని, మిగిలిన ఇద్దరు నిందితులు స్నేహితుడికి సహకరించారని తెలిసింది.

శాటిలైట్ బస్టాండ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో యువతిని భయపెట్టి అత్యాచారం చేసిన నిందితులు సహా నిందితులకు సహకరించిన ఇద్దరు యువకులు ఘటన అనంతరం ఆమెను చీకట్లో ప్రదేశంలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ యువతి రాత్రంతా నిర్మానుష్య ప్రాంతంలో బయటకు రాలేక నరకం అనుభవించింది. మరుసటి రోజు ఉదయం శాటిలైట్ బస్టాండ్ సమీపంలోని ప్రాంతంలో యువతి ఏడుస్తూ కనిపించింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విజయపర మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.అస్వస్థతకు గురైన యువతికి ప్రాథమిక చికిత్స అందించాయని పోలీసులు అన్నారు. యువతి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు విజయపుర మహిళా స్టేషన్ లో కేసు పెట్టింది. రాత్రి మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేద్దామని చెప్పి తనను బస్ స్టాండ్ లో నుంచి బయటకు పిలుచుకుని వెళలారని భాదితురాలు పోలీసులకు చెప్పింది. సీీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications