కర్ణాటక కింగ్ మేకర్ ఎవరు ?, మెగా సర్వేలో షాకింగ్ సమాచారం, లీడర్స్ లెక్కలు రివర్స్ !

బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు పార్టీల నాయకులకు చెమటలు పడుతున్నాయి. మమ్మల్ని ఓటర్లు ఆధరిస్తారా ? అంటూ చాలా మంది నాయకుల్లో భయం పట్టుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మోగా సర్వే ఫలితాలు విడుదల కావడంతో ఇప్పుడు పలు పార్టీల్లో ఈ సర్వే మీద చర్చ మొదలైయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇప్పటికే పలు సంస్థలు, మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఓటర్లు ఏ పార్టీని, ఏ నాయకులను ఆధరిస్తున్నారు ?, ఏ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు మంచిది ?, ఎవరు సీఎం అయితే బాగుంటుంది ? అంటూ పలు సంస్థలు సర్వేలు నిర్వహించి వాటి వివరాలను విడుదల చేస్తున్నాయి.

Karnataka assembly elections, Public TV mega survey

కర్ణాటకలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పబ్లిక్ టీవీ న్యూస్ చానల్ మెగా సర్వే పేరుతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అంటూ చాలా రోజుల నుంచి సర్వే నిర్వహించింది. పబ్లిక్ టీవీ నిర్వహించిన మెగా సర్వే ఫలితాలను ఆ సంస్థ సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసింది.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చితకలబడి జేడీఎస్ పార్టీకి సీఎం పదవి ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంటుందని మెగా సర్వే తెలిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సంపాధించి మొదటి స్థానంలో నిలుస్తుందని మెగా సర్వే తెలిపింది.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 92 నుంచి 102 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని మెగా సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటుందని మెగా సర్వే తెలిపింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 83 నుంచి 90 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని మెగా సర్వే తెలిపింది. ఇక ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా లబ్ది పొందుతూ సీఎం సీటు ఎగరేసుకుపోతున్న జేడీఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? అని మెగా సర్వే తెలిపింది.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి 37 సీట్లు వచ్చాయి. అయితే ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి 29 నుంచి 34 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, గతంలో కంటే కొన్ని సీట్లు జేడీఎస్ పార్టీ కోల్పోతుందని మెగా సర్వే తెలిపింది. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2 నుంచి 4 స్థానాల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని మెగా సర్వే తెలిపింది.

మొత్తం మీద మెగా సర్వేలో ఏ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, కర్ణాటకలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇప్పటి వరకు జరిగిన అనేక సర్వేల్లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెలుగు చూసింది, కర్ణాటకలో మరోసారి జేడీఎస్ పార్టీ, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కింగ్ మేకర్లు కానున్నారని పలు సర్వేలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+