Wife: బెడ్ రూమ్ లో భార్యను నరికి చంపి ఇంటికి తాళం వేసి భర్త ఎస్కేప్, గృహప్రవేశం టైమ్ లో షాక్ !

బెంగళూరు/హాసన్: వివాహం చేసున్న దంపతులు సంతోషంగా జీవించారు. కూతురుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కొడుకు పెళ్లి చేసుకుని ఐటీ హబ్ లో నివాసం ఉంటున్నాడు. దంపతుల మాత్రమే సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. దంపతులకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఓ విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి పత్రిక ఇవ్వడానికి దంపతుల ఇంటికి బంధువులు వెళ్లారు. ఇంటి బయట తాళం వేసి ఉండటం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో బంధువులు కొడుక్కి ఫోన్ చేసి చెప్పారు. కొడుకు వెళ్లి చూడగా అతని తల్లి బెడ్ రూమ్ లో దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం భార్యను హత్య చేసిన భర్త ఇంటి బయట తాళం వేసుకుని ఎస్కేప్ అయ్యాడు. త్వరలో కొత్త ఇల్లు గృహప్రవేశం చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈదారుణం జరిగింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని సకలేశపుర తాలుకాలోి తంబలిగెర గ్రామంలో పరమేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 35 సంవత్సరాల క్రితం పరమేష్ రత్నమ్మ (56) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పరమేష్, రత్నమ్మ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. 25 సంవత్సరాలు పరమేష్, రత్నమ్మ దంపతులు చాలా సంతోషంగా జీవించారు.

దంపతులకు రూ, కోట్ల విలువైన కాఫీ తోటలు

దంపతులకు రూ, కోట్ల విలువైన కాఫీ తోటలు

పరమేష్, రత్నమ్మ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం వారి కుమార్తెకు వివాహం చేసి ఆమెను అత్తారింటికి పంపించారు. పరమేష్, రత్నమ్మ దంపతుల కుమారుడు వివాహం చేసుకుని అతని భార్యతో కలిసి బెంగళూరులో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. పరమేష్, రత్నమ్మ దంపతులకు కోట్ల రుపాయల విలువ చేసే ఐదు ఎకరాల కాఫీతోటలు ఉన్నాయి.

కొత్త ఇల్లు కట్టేశారు

కొత్త ఇల్లు కట్టేశారు

రత్నమ్మకు కొత్త ఇంటిని కట్టుకోవాలని ఆశ ఉండేది, బెంగళూరులో ఉన్న కుమారుడు గ్రామంతో కొత్త ఇంటిని కట్టించాడు. త్వరలో కొత్త ఇంటి గృహప్రవేశం చెయ్యాల్సి ఉంది. ఇదే సందర్బంలో పరమేష్, రత్నమ్మ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రత్నమ్మ, పరమేష్ దంపతులు మాత్రమే సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు.

బెడ్ రూమ్ లో భార్యను చంపేసి తాళం వేసి ఎస్కేప్

బెడ్ రూమ్ లో భార్యను చంపేసి తాళం వేసి ఎస్కేప్

పరమేష్, రత్నమ్మ దంపతుల ఓ విషయంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి పత్రిక ఇవ్వడానికి పరమేష్ ఇంటికి బంధువులు వెళ్లారు. ఇంటి బయట తాళం వేసి ఉండటం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో బంధువులు రత్నమ్మ కొడుక్కి ఫోన్ చేసి చెప్పారు. బెంగళూరు నుంచి కొడుకు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా అతని తల్లి రత్నమ్మ బెడ్ రూమ్ లో దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

మూడు రోజుల క్రితమే హత్య

మూడు రోజుల క్రితమే హత్య

మూడు రోజుల క్రితం అర్దరాత్రి బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భార్య రత్నమ్మను కొడవలితో నరికి దారుణంగా స్పాట్ లో చంపేసిన పరమేష్ ఇంటి బయట తాళం వేసుకుని ఎస్కేప్ అయ్యాడు. గతంలో కూడా రత్నమ్మ మీద పరమేష్ హత్యాయత్నం చేశాడని, రెండు నెలలు ఆసుపత్రిలో ఉన్న చికిత్స పొంది కోలుకుందని బంధువులు అన్నారు.

కేసు పెట్టిన కొడుకు

కేసు పెట్టిన కొడుకు

త్వరలో కొత్త ఇల్లు గృహప్రవేశం చెయ్యడానికి రత్నమ్మ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆమె హత్యకు గురైయ్యింది. తన తల్లి రత్నమ్మను తన తండ్రి పరమేష్ హత్య చేశాడని సొంత కొడుకు పోలీసు కేసు పెట్టాడు. రత్నమ్మను చంపేసి పారిపోయిన ఆమె భర్త పరమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+