Wife: లవ్ మ్యారేజ్, 7 నెలల గర్బవతి భార్యను చంపేసి ప్రభుత్వ కారులో శవం మాయం, ఉద్యోగం చేస్తూ!
బెంగళూరు/ మైసూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రభుత్వ శాఖలో ప్రియుడు కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎప్పటికైనా తన ప్రియుడికి ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని ప్రియురాలికి నమ్మకం పెరిగిపోయింది. కొంతకాలం ప్రేమికులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పెద్దలను ఎదిరించి ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన మూడు నెలలకే ఇరు కుటుంబ సభ్యులు రాజీ అయిపోయారు. భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నది. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.
పెద్దలు రాజీలు చేసినా ఫలితం లేకపోయింది. అత్తారింటిలో ఉంటే తనకు కష్టాలు ఎక్కువ అయ్యాయని ఆమె తేల్చి చెప్పింది. అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే అద్దె ఇల్లు తీసిచ్చి వారి కాపురానికి కావలసిన వస్తువులు అన్నీ తీసిచ్చారు. ప్రస్తుతం భార్య 7 నెలల గర్బవతి. తల్లిదండ్రులతో కలిసి ఉండకపోయినా భర్త మాత్రం అతని భార్యకు టార్చర్ పెట్టాడు. చివరికి తన భార్య గర్బవతి అని కూడా చూడకుండా ఆమెను చంపేశాడు. ప్రభుత్వానికి చెందిన కారులోనే భార్య శవాన్ని తీసుకెళ్లిన భర్త ఆమె శవాన్ని తీసుకెళ్లి నదిలో విసిరేశాడు. భార్య శవాన్ని నదిలో విసిరేసిన మూడు రోజుల తరువాత మ్యాటర్ బయటకు వచ్చింది. భార్యను దారుణంగా హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

పక్కపక్క ఊర్లలో ప్రేమికులు
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని ఉద్బూరు గ్రామంలో నివాసం ఉంటున్న స్వామి, లక్ష్మీల కుమార్తె అశ్వినీ (24) అనే యువతి, మైసూరు సమీపంలోని మైదనహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న నందీష్ కుమారుడు ప్రమోద్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.

లవ్ మ్యారేజ్
ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అశ్విని ప్రియుడు ప్రమోద్ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రమోద్ కారు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడని, ఎప్పటికైనా తన ప్రియుడికి ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని అతని ప్రియురాలు అశ్వినీ చాలా నమ్మకం పెంచుకుంది. కొంతకాలం ప్రేమికులు ప్రమోద్, అశ్వినీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

రాజీ అయిన పెద్దలు.... అత్తారింటిలో కాపురం
పెద్దలను ఎదిరించి ప్రేమికులు ప్రమోద్, అశ్విని గత ఏడాది 2021లో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన మూడు నెలలకే ప్రమోద్, అశ్వినీ కుటుంబ సభ్యులు రాజీ అయిపోయారు. భర్త ప్రమోద్ కుటుంబ సభ్యులతో కలిసి అశ్వినీ ఒకే ఇంట్లో (అత్తారింటిలో) కాపురం ఉంటున్నది. రానురాను ప్రమోద్, అశ్వినీ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

మైసూరులో కాపురం
పెద్దలు రాజీలు చేసినా ఫలితం లేకపోయింది. అత్తారింటిలో ఉంటే తనకు కష్టాలు ఎక్కువ అయ్యాయని అశ్వినీ తేల్చి చెప్పింది. అశ్వినీ కుటుంబ సభ్యులు మైసూరులోని హింకల్ లోని నన్నేశ్వర లేఔట్ లో అద్దె ఇల్లు తీసిచ్చి వారి కాపురానికి కావలసిన వస్తువులు అన్నీ తీసిచ్చారు. ప్రస్తుతం ప్రమోద్ భార్య అశ్వినీ 7 నెలల గర్బవతి. తల్లిదండ్రులతో కలిసి ఉండకపోయినా ప్రమోద్ అతని భర్త అశ్వినీకి మాత్రం అతని భార్యకు టార్చర్ పెడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

భార్యను చంపేసి ప్రభుత్వ కారులో శవం మాయం చేసిన భర్త
తన భార్య అశ్వినీ 7 నెలల గర్బవతి అని కూడా చూడకుండా ప్రమోద్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన కారులోనే భార్య అశ్వినీ శవాన్ని తీసుకెళ్లిన ఆమె భర్త ప్రమోద్ ఆమె శవాన్ని బెలవాడి సమీపంలోని నదిలో విసిరేశాడు. భార్య అశ్వినీ శవాన్ని నదిలో విసిరేసిన తరువాత ఇంటికి వెళ్లిన ప్రమోద్ ఆఫీసుకు వెళ్లి వస్తున్నాడు.
Recommended Video


భర్త మ్యాటర్ లీక్
మూడు రోజుల తరువాత మ్యాటర్ బయటకు వచ్చింది. భార్య అశ్వినీని దారుణంగా హత్య చేసిన భర్త ప్రమోద్ ను పోలీసులు అరెస్టు చేశారు. అశ్వినీ సోదరి యశస్విని ఫిర్యాదు మేరకు మైసూరులోని విజయనగర పోలీసులు కేసు నమోదు చేసి ప్రమోద్ తండ్రి, సోదరి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications