• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bigg Boss Telugu:మోనాల్ మళ్లీ సేఫ్.. ఈక్వేషన్ మారితే ఎలిమినేట్ అయ్యేది అతనే..!

|

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ తెలుగు షో క్రమంగా ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. షో ప్రారంభమైన తొలినాళ్లలో పేలవంగా సాగిన ఈ రియాల్టీ షో... ఆ పై ఆసక్తిని రేపేలా మారింది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్, లవ్ స్టోరీస్, డ్యాన్సులు, పార్టీలు హంగామాలతో బిగ్‌ బాస్ హౌజ్ ప్రేక్షకులను సీట్లలో కూర్చుండేలా చేస్తోంది. ఇక వారాంతం వచ్చేసింది. ఎలిమినేషన్ టైమ్ దగ్గర పడిపోయింది. ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై గూగుల్‌లో తెగ సెర్చింగులు జరుగుతున్నాయి. అయితే ఎవరు ఎలిమినేట్ కానున్నారనే దానిపై ఓ రిపోర్ట్ మీకోసం.

ఎలిమినేషన్‌పై భిన్నాభిప్రాయాలు

ఎలిమినేషన్‌పై భిన్నాభిప్రాయాలు

తెలుగులో బిగ్ బాస్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే సస్పెన్స్ ఈ సారి కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ఆడియెన్స్ వేసిన ఓట్లతో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో బిగ్‌బాస్‌ మదిలో ఉంది. ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ముందుగా సూర్యకిరణ్‌తో ప్రారంభమైన తొలి ఎలిమినేషన్ గతవారం సుజాత ఎలిమినేషన్ లేటెస్ట్‌గా జరిగింది. ఇక ఈ వారం హౌజ్‌ను ఎవరు వీడుతారు అనేదానిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 రేసులో మోనాల్ బట్ సేఫ్

రేసులో మోనాల్ బట్ సేఫ్

ఈ సారి హౌజ్‌లో అందరి కళ్లు ఉత్తరాది భామ మోనాల్ గజ్జర్ పై పడ్డాయి. అయితే ఆమె బిగ్‌బాస్ టాస్కులు సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా... బిగ్‌ బాస్ మోనాల్‌ పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారనే అభిప్రాయం ఇటు ప్రేక్షకుల్లో అటు నెటిజెన్లలో వ్యక్తమవుతోంది. కాబట్టి మోనాల్‌ ఎలిమినేట్ అయ్యేలా ఆ స్థాయిలో ఓట్లు వచ్చినప్పటికీ బిగ్‌బాస్ మాత్రం ఏ కారణం చేతనో ఆమెను ఎలిమినేట్ చేయరనే చర్చ జరుగుతోంది. కాబట్టి మోనాల్‌ ఈవారం కూడా సేఫ్ అయినట్లే అని సమాచారం. అంతేకాదు ఇతరుల కంటే మోనాల్‌కే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఆ ఇంట్రెస్ట్ ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక అభిజీత్-అఖిల్‌తో మోనాల్ మంచి సంబంధం నడుపుతూ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ట్రాక్ వేస్తోందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మోనాల్ కనిపించినప్పుడు టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఛానెల్ మార్చేస్తున్నట్లు సమాచారం. తెలుగు ఎలాగు మాట్లాడటం లేదని ఇంగ్లీషులో మాట్లాడే వారు తెలుగు బిగ్‌బాస్‌కు ఎందుకని నెటిజెన్లు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ఇదేదో తెలుగు రియాల్టీ షోలో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్లుగా ఉందంటూ సెటైర్స్ వేస్తున్నారు.

మోనాల్ సేవ్ అయితే అఖిల్ అభిజీత్‌లు కూడా..

మోనాల్ సేవ్ అయితే అఖిల్ అభిజీత్‌లు కూడా..

ఇక మోనాల్ గజ్జర్ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు ఇన్‌సైడ్ ఇన్ఫో. అయితే ఆమె సేవ్ అవుతుందని కూడా తెలుస్తోంది. కానీ అది బిగ్‌బాస్ కాబట్టి ఏమైనా జరగొచ్చు. ఇక ఈ వారంలో ఎలిమినేషన్‌ కోసం నామినేట్ అయిన వారిలో లాస్య, నోయెల్, అఖిల్, అభిజీత్, దివి, కుమార్ సాయిలు ఉన్నారు. అయితే అఖిల్ అభిజీత్‌లు కూడా సేవ్ అవుతారని సమాచారం. ఎందుకంటే మోనాల్ సేఫ్ అయితే వీరు కూడా సేవ్ కావాల్సిందే. దీని వెనక ఉన్న లాజిక్ సింపుల్‌ అని చెబుతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ రక్తి కట్టి షో సక్సెస్‌ఫుల్‌గా రన్ కావాలంటే ఈ త్రయం హౌజ్‌లో ఉండాల్సిందే. ఇక దివి, నోయల్ సీన్ కూడా ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. అయితే దివి సేవ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక హారికకు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. గతంలో హారిక ఎలిమినేషన్‌లో హైడ్రామానే జరిగింది.

నోయల్ ..ఈక్వేషన్స్ మారితే నోయల్ ఔట్

నోయల్ ..ఈక్వేషన్స్ మారితే నోయల్ ఔట్

మొత్తానికి అన్ని ఈక్వేషన్స్‌ను పరిశీలిస్తే ఈ సారి నోయల్‌కు ఎక్కువ అవకాశాలున్నప్పటికీ కుమార్ సాయి హారికలు కూడా సేఫ్ అవుతారని కచ్చితంగా చెప్పలేము. అంతేకాదు సూర్యకిరణ్ ఎలిమినేషన్ తర్వాత హౌజ్ నుంచి అంతా మహిళలే ఎలిమినేట్ అయ్యారు. ఈ సారి ఆ ఈక్వేషన్ కనుక బిగ్‌బాస్ పరిగణలోకి తీసుకుంటే కుమార్ సాయి లేదా నోయల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

English summary
Another weekend has come for Bigg Boss elimination. This time there would be a male contestant who would leave the house if sources are to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X