పెనుముప్పు: భూమి మీదకు దూసుకొస్తున్న చైనా స్పేస్ స్టేషన్, అంతమేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్:చైనాకు చెందిన తియాంగాంగ్-1 స్పేస్ స్టేషన్ భూమిపై కూలిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 19 వేల పౌండ్ల బరువున్న ఈ స్పేస్ స్టేషన్ భూమి మీద పడితే తీవ్ర విధ్వంసం తప్పదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే చైనా శాస్త్రవేత్తలు మాత్రం దీని వల్ల పెద్దగా నష్టం ఉండదని అభిప్రాయపడుతున్నారు.

చైనాకు చెందిన తియాంగాంగ్ -1 స్పేస్ స్టేషన్ భూమిపై కూలిపోయే అవకాశం ఉంది. ఈ స్పేస్ స్టేషన్‌పై శాస్త్రవేత్తలు నియంత్రణ కోల్పోయారని సమాచారం. ఈ స్పేస్ స్టేషన్ భూ కక్ష్యలోకి ప్రవేశిస్తోంది.

2016 మార్చి మాసంలోనే చైనా శాస్త్రవేత్తలు ఈ స్పేస్ స్టేషన్‌పై నియంత్రణను కోల్పోయారని సమాచారం. ఆనాటి నుండి ఈ స్పేష్ స్టేషన్ ఆకాశంలోనే పరిభ్రమిస్తూ భూమి వైపుకు దూసుకువస్తోంది.

 స్పేస్ స్టేషన్‌తో ప్రమాదమేనా

స్పేస్ స్టేషన్‌తో ప్రమాదమేనా

తియాంగాంగ్‌-1 స్పేస్ స్టేషన్‌ శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయి భూమి వైపుకు దూసుకువస్తోంది.ఆకాశంలో పరిభ్రమిస్తూ.. నెమ్మదిగా భూమివైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించిందని సైంటిస్టులు చెబుతున్నారు. 19 వేల పౌండ్ల బరువున్న ఈ స్పేస్‌ స్టేషన్‌ అంతరిక్షం నుంచి భూమిపైన పడబోతోంది. అదే జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సర్వనాశనం తప్పదా?

సర్వనాశనం తప్పదా?

తియాంగాంగ్‌-1 స్పేస్ స్టేషన్ భూమి మీద కూలిపోతే తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ స్పేస్ స్టేషన్ ఎక్కడ కూలిపోతే ఆ ప్రాంతంలో జీవ రాశి పూర్తిగా నాశనమయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు.పెద్ద పెద్ద భవనాలతో పాటు అన్నీ దెబ్బతినే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 ఎక్కడ కూలిపోతోంది?

ఎక్కడ కూలిపోతోంది?

ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలోని 43 డిగ్రీల అక్షాంశాల మధ్య ఈ స్పేస్ స్టేషన్ ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి - మార్చి మధ్యకాలంలో భూమిమీద భీకరంగా కూలిపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, బీజింగ్‌, రోమ్‌, ఇస్తాంబుల్‌, టోక్యో నగరాలలో ఇది కూలిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 నష్టం లేదంటున్న చైనా

నష్టం లేదంటున్న చైనా

తియాంగాంగ్‌ - 1 కూలిపోవడం వల్ల భూమికి వచ్చే నష్టం పెద్దగా ఏం ఉండదని చైనా చెబుతోంది.ఇప్పటికే స్పేస్‌ స్టేషన్‌లోకి కీలక భాగాలన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని.. స్పేస్‌ ఇంజినీరింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వూ పింగ్‌ అంటున్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే.. స్పేస్‌ స్టేషన్‌ మండిపోతుందని.. ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It's pretty common for old satellites and other "space junk" to come falling back down to Earth. But while hundreds of pieces of debris come down each year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి