వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విత్ డ్రా లిమిట్: ఏ ఏటీఎం నుంచి ఎంత విత్ డ్రా చేయవచ్చునో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏ బ్యాంక్ నుంచి ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చునో తెలుసా? ఒక్కో బ్యాంకు, ఒక్కో కార్డు పైన ఒక్కో లిమిట్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ.. ఇలా ఒక్కో బ్యాంక్ ఏటీఎం నుంచి ఒక్కరోజులో డబ్బు తీసుకునే విషయంలో పరిమితి ఉంది.

ఎస్‌బీఐ ఏటీఎం

ఎస్‌బీఐ ఏటీఎం

ఎస్‌బీఐ మాస్ట్రో, క్లాసిక్ కార్డుదారులు నిబంధన ప్రకారం రూ.20,000 వేలు తీసుకోవచ్చు. ఎస్‌బీఐ గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ డెబిట్‌ కార్డు కింద రూ.50,000, ప్లాటినం ఇంటర్నేషనల్‌ డెబిట్‌ కార్డుదారులు రూ.లక్ష వరకు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు క్లాసిక్, మాస్ట్రో కార్డులపై ఒక్క రోజులో రూ.40వేలు అత్యధికంగా తీసుకోవచ్చు. కానీ పై కొత్త నిబంధనలు అక్టోబర్ 31వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

ఐసీఐసీఐ ఏటీఎం

ఐసీఐసీఐ ఏటీఎం

ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లకు వివిధ రకాల కార్డులను ఆఫర్‌ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రతి కస్టమర్‌ ఏటీఎం నుంచి ఒక్క రోజులో రూ.50,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రివిలేజ్‌ బ్యాంకింగ్‌ టైటానియం డెబిట్‌ కార్డు దారులు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. స్మార్ట్‌ షాపర్స్‌ గోల్డ్‌ డెబిట్‌ కార్డుదారులు రూ.75,000, స్మార్ట్‌ షాపర్స్‌ సిల్వర్‌ కార్డు దారులు రూ.50,000 వేలు డ్రా చేసుకొనే అవకాశం ఉంది.

పీఎన్‌బీ ఏటీఎం

పీఎన్‌బీ ఏటీఎం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లాసిక్, ప్లాటినమ్ డెబిట్‌ కార్డులను ఇస్తోంది. రూపే, మాస్టర్‌ కార్డులు కూడా ఇస్తోంది. ప్లాటినమ్ కార్డుదారులు రోజుకు రూ.50,000, క్లాసిక్ కార్డుదారులు రోజుకు రూ.25,000 ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.

యాక్సిస్ ఏటీఎం

యాక్సిస్ ఏటీఎం

యాక్సిస్ బ్యాంకు బుర్గుండీ డెబిట్ కార్డుపై రోజుకు రూ.3 లక్షలు డ్రా చేసుకునే వీలు ఉంది. టైటానియం ప్రీమియం, ప్లస్ డెబిట్ కార్డుల నుంచి రోజుకు రూ.50వేలు తీసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం

హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్లాటినమ్ చిప్ డెబిట్ కార్డు నుంచి రోజుకు లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చును. టైటానియ్ రాయల్ డెబిట్ కార్డుదారులు రూ.75వేలు, ఈజీ షాప్ డెబిట్ కార్డు పైన రూ.25వేలు, రూపే ప్రీమియం కార్డుపై రూ.25వేలు, ఈజీ షాప్ టైటానియం డెబిట్ కార్డుపై రూ.50వేలు విత్ డ్రా చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం

బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో రూపే క్లాసిక్ కార్డుపై రూ.25వేలు, బరోడా మాస్టర్ ప్లాటినమ్ కార్డుపై రూ.50వేలు రూపే ప్లాటినమ్ కార్డుపై రూ.50వేలు, వీసా ఎలక్ట్రాన్ కార్డుపై రూ.25వేలు, మాస్టర్ క్లాసిక్ కార్డుపై రూ.25వేలు, వీసా ప్లాటినమ్ చిప్ కార్డుపై రూ. లక్ష తీసుకోవచ్చు.

English summary
2 SBI slashes ATM withdrawal limit for certain card holders from Oct 31
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X