చైనాకు ఆపిల్ షాక్.. 70-80 మిలియన్ ఐఫోన్లు భారత్ లోనే ఉత్పత్తి!
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ల ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకుంటోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోంటోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల నుండి భవిష్యత్ అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఆపిల్ తన ఉత్పత్తిని ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో, ఆపిల్ తన ఐఫోన్ల ఉత్పత్తిని భారతదేశంలో గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ఆపిల్ సంవత్సరానికి దాదాపు 40-43 మిలియన్ ఐఫోన్లను భారతదేశంలో ఉత్పత్తి చేస్తోంది. వీటిలో సుమారు 80% ఎగుమతి మార్కెట్ల కోసం తయారవుతున్నాయి. ఈ ఉత్పత్తి 2026 నాటికి 70-80 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఉత్పత్తి పెరిగితే, అమెరికాకు ఐఫోన్ల ప్రధాన సరఫరాదారుగా భారతదేశం అవతరించనుంది.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సువర్ణావకాశం
ఆపిల్ తన ఐఫోన్లను భారతదేశంలో ఫాక్స్‌కాన్ , టాటా ఎలక్ట్రానిక్స్ వంటి భాగస్వాముల ద్వారా తయారు చేస్తోంది. ముఖ్యంగా, టాటా ఎలక్ట్రానిక్స్ ఇటీవల భారతదేశంలోని విస్ట్రాన్ , పెగాట్రాన్ తయారీ యూనిట్లను కొనుగోలు చేయడం, ఈ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మార్పుతో రాబోయే 18 నెలల్లో ప్రపంచవ్యాప్త ఐఫోన్ అమ్మకాలలో దాదాపు 40% భారతదేశంలోనే తయారవుతాయి. ప్రస్తుతం ఈ వాటా 18-20% గా ఉంది. ఈ భారీ పెరుగుదల భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఒక సువర్ణావకాశం మారనుంది.
80 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తి
ఇది భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది. 70-80 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తిని పెంచడం భారతదేశ విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఐడిసి ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవకెందర్ సింగ్ అన్నారు. ఆపిల్ ఇప్పటికే భారతదేశాన్ని తన రెండవ అతిపెద్ద గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా స్థాపించింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గా భారతదేశం కావడం ఆపిల్‌కు అదనపు బలం చేకూరుతుంది. FY25 లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను ఆపిల్ ఎగుమతి చేసింది.. ఇది FY24 లోని రూ. 85,000 కోట్ల నుండి దాదాపు రెట్టింపు అయింది.
చైనా టు ఇండియా
అయితే, ఐఫోన్ తయారీని చైనా నుండి తరలించడం అనేది భారతదేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై కూడా ఆధారపడి ఉంటుంది. ట్రంప్ పరిపాలన చైనా పట్ల మృదువైన వైఖరిని తీసుకుంటే, భారత్ కు ఈ మార్పు నెమ్మదిగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.
అంతేకాకుండా, భారతదేశం గణనీయమైన సంస్కరణలను అమలు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉన్న అధిక వ్యయాలు , పన్నులు, సుంకాలకు సంబంధించిన విధానాల అనిశ్చితులను తగ్గించడం ముఖ్యం. లేదంటే, ఈ ఉత్పత్తి చైనా నుండి వియత్నాం వంటి ఇతర దేశాలకు మళ్ళించబడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కీలకమైన సబ్-అసెంబ్లీలు , భాగాలపై సుంకాలు తగ్గించడం, పన్ను నిర్మాణాలను సరళీకృతం చేయడం అవసరం అని నీతి ఆయోగ్ అధ్యయనం కూడా నొక్కి చెప్పింది.
ట్రంప్ యొక్క కొత్త సుంకాల వ్యవస్థలో చైనా , వియత్నాంతో పోలిస్తే భారత్ కు ఒక రకంగా అనుకూలమైన స్థానం ఉన్నప్పటికీ, నిపుణులు న్యూఢిల్లీ అమెరికాతో ప్రయోజనకరమైన దీర్ఘకాలిక ఒప్పందాన్ని పొందడానికి వ్యూహాత్మకంగా చర్చలు జరపాలని సూచిస్తున్నారు. అలాగే, వియత్నాం వంటి తయారీ పోటీదారులను అధిగమించడానికి మెరుగైన విధానాలు తప్పనిసరి అని భావిస్తున్నారు..
మొత్తంగా, ఆపిల్ యొక్క ఈ భారీ ప్రణాళిక భారతదేశ తయారీ రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగానికి ఒక చారిత్రాత్మక అవకాశం. సరైన విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, నిరంతర సంస్కరణలతో భారత్ ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తి కేంద్రంగా మారే పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు గొప్ప బలాన్నిస్తుంది.
-
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications