ఈ నాలుగు రాష్ట్రాల యువకులకు ఉద్యోగాల్లో నో ఎంట్రీ..

ఉద్యోగాల ఎంపికలో ప్రాంతం, రాష్ట్రం ఆధారంగా వివక్ష చూపడం ఎంతవరకు సమంజసం? కేవలం కొందరి ప్రవర్తన కారణంగా ఒక ప్రాంతంలోని పూర్తి వర్గాన్ని తప్పుపట్టవచ్చా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా టెక్కీలు, నెటిజన్ల మధ్య ఇదే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న 'ఏవన్ స్పోర్ట్స్ వరల్డ్' అనే సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ కార్తీక్ షెణాయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది.

ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏ ఒక్క పురుష అభ్యర్థిని కూడా తమ కంపెనీలో ఉద్యోగంలోకి తీసుకునేది లేదంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సంస్థలో సుదీర్ఘ చర్చలు, అంతర్గత అభిప్రాయ భేదాల తర్వాతే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Bengaluru CEO Refuses To Hire Male Candidates From Four North Indian States Sparking Huge Workplace Debate

మాజీ ఉద్యోగి ప్రవర్తనే ఈ నిర్ణయానికి కారణం..

ఈ సంచలన నిర్ణయం వెనుక ఓ చేదు అనుభవం ఉందని సీఈఓ కార్తీక్ వెల్లడించారు. తమ కంపెనీలో గతంలో పనిచేసిన ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ తీరు వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆ ఉద్యోగిని నియమించే సమయంలో ఆయన రెజ్యూమ్, బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయని, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు.

నవ్విద్దామని వస్తే.. స్టేజ్‌పైనే కాలర్ పట్టుకున్న ప్రొఫెసర్!: Viral video
నవ్విద్దామని వస్తే.. స్టేజ్‌పైనే కాలర్ పట్టుకున్న ప్రొఫెసర్!: Viral video

అయితే, రెండు నెలలు గడిచాక సదరు ఉద్యోగి మహిళా సహోద్యోగుల పట్ల అత్యంత దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని ఆరోపించారు. హెచ్చరించినా తీరు మార్చుకోకపోగా, ఒక మహిళా సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు యత్నించాడని ఆయన ఆరోపించారు. తమ సంస్థ చిన్న పిల్లలతో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, మహిళా ఉద్యోగులు, పిల్లల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని, అందుకే ఈ కఠిన వైఖరి అవలంబించాల్సి వచ్చిందని ఆయన సమర్థించుకున్నారు.

వ్యక్తిగత తప్పుకు రాష్ట్రాలవారినీ శిక్షించడమేంటి?

మహిళల భద్రతకు పెద్దపీట వేయడం అభినందించదగ్గ విషయమే అయినప్పటికీ, ఒక వ్యక్తి చేసిన తప్పునకు నాలుగు రాష్ట్రాల ప్రజలందరినీ బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ప్రతిభ, అర్హతలను బట్టి కాకుండా వారు పుట్టిన రాష్ట్రాన్ని బట్టి ఉద్యోగాలు నిరాకరించడం ప్రాంతీయ వివక్ష కిందకు వస్తుందని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఎవరి ప్రవర్తన వారి వ్యక్తిగతం అని, అందరినీ ఒకే గాటన కట్టడం తప్పు అని హితవు పలుకుతున్నారు. అయితే, తన నిర్ణయంపై వస్తున్న విమర్శలను సీఈఓ కార్తీక్ పక్కన పెట్టి, తన సిబ్బంది రక్షణే ముఖ్యమంటూ తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

వాష్ రూమ్ వెళ్లాలంటే పర్మిషన్..! లీవ్ అడిగితే ఉద్యోగం పోయింది.. టెక్ మహింద్రాపై సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఫైర్
వాష్ రూమ్ వెళ్లాలంటే పర్మిషన్..! లీవ్ అడిగితే ఉద్యోగం పోయింది.. టెక్ మహింద్రాపై సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఫైర్

భద్రత వర్సెస్ ప్రాంతీయ వివక్ష.. ఎక్కడ గీత గీయాలి?

ఈ వివాదం ఇప్పుడు కేవలం ఒక కంపెనీ హైరింగ్ పాలసీకి మాత్రమే పరిమితం కాలేదు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత కోసం కంపెనీలు ఎలాంటి నిబంధనలు అనుసరించాలి? సెఫ్టీ పేరిట ఇలాంటి సామూహిక నిషేధాలు విధించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. ఒకవైపు సంస్థలో పనిచేసే మహిళల భద్రత అత్యంత ముఖ్యమైనదైనప్పటికీ, మరోవైపు ప్రాంతాల వారీగా అభ్యర్థులను వేరు చేయడం సరికాదన్న వాదన బలపడుతోంది. ఏదేమైనా, ఒక చిన్న కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి, రిక్రూట్‌మెంట్ పద్ధతులపై సరికొత్త డిబేట్‌కు తెరలేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+