• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2018లో బడ్జెట్: ఐటీ స్థానే వినిమయ పన్నుతో అసలుకే మోసం

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: రోజురోజుకు ఆదాయం పన్ను (ఐటీ) రద్దు చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నది. దీని స్థానంలో వినియోగ పన్ను (సీటీ)ని ప్రవేశపెట్టాలని చాలా మంది వాదిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్లు పన్నుల ఎగవేతను అరికట్టడంతోపాటు అటు నల్లధనాన్ని నిర్మూలించేందుకు వీలవుతుందని, అంతేకాక పన్నుల పరిధి విస్తరణ ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించవచ్చని ఆదాయం పన్ను రద్దు చేయాలని కోరుతున్న వారి వాదన.

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ రాంసింగ్ మాటల్లో చెప్పాలంటే ఈ అభిప్రాయాలు వాస్తవానికి చాలా దూరంగా విరుద్ధంగా ఉన్నాయి. ఆదాయం పన్ను చెల్లింపు దారుల డిమాండ్ల మేరకు ఆదాయం పన్ను (ఐటీ)ని రద్దుచేసి దాని స్థానే వినియోగ పన్ను (సీటీ)ని ప్రవేశపెడితే దేశంలోని సంపన్నులకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.

అటు ప్రభుత్వంతో పాటు ఇటు పేదలు, సామన్య మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమని చెబుతున్నారు. ఇది పూర్తిగా తిరోగమన చర్యగా మారుతుంది. ఇది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా మారుతుందని ఆర్థికవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న పన్నుల వ్యవస్థలో పలు సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్న నిపుణులు.. 'ఐటీ' రద్దు వాటిలో ఒకటి మాత్రం కాదని తేల్చేస్తున్నారు.

 సీటీతో పోలిస్తే ఐటీ చట్టమే మేలు

సీటీతో పోలిస్తే ఐటీ చట్టమే మేలు

వస్తు, సేవల కొనుగోలు కోసం ప్రజలు చేసే వాస్తవ ఖర్చుపై విధించే పన్నునే వినియోగ పన్ను అంటారు. వస్తు, సేవల కోసం సాధారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు తమ ఆదాయాన్నంతా ఖర్చు చేస్తారు. కనుక వినియోగ పన్నును ప్రవేశపెడితే వీరి ఆదాయంపై పన్ను పడుతుంది. ఆదాయంలో సింహ భాగాన్ని దాచుకునే ధనికులపై మాత్రం వినియోగ పన్ను ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. 40 శాతం ఫ్లాట్ వినియోగ పన్ను భారం.. పూర్తి ఆదాయాన్ని ఖర్చుచేసే పేదవాడి మొత్తం ఆదాయంలో 40 శాతంతో సమానం. మొత్తం ఆదాయంలో మూడింట ఒక వంతు కూడా ఖర్చు చేయని ధనికుడి ఆదాయంలో ఇది కేవలం 13 శాతం మాత్రమే. వినియోగ పన్నుతో పోలిస్తే ధనికుడు తన ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని పన్నుగా చెల్లించే మంచి ఆదాయం పన్ను చట్టమే ప్రగతిశీలకమైనది. అంతేకాక వినియోగ పన్ను అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. దేశంలో ప్రస్తుతం ఆదాయం పన్ను వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి రూ.4.5 లక్షల కోట్లకు పైగా రాబడి వస్తున్నది. ఈ ఆదాయాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నా, మరింత పెంచుకోవాలన్నా వినియోగ పన్నును మరింత పెంచాల్సి ఉంటుంది. వస్తు, సేవల పన్ను రేట్లను మరింత పెంచకపోతే ప్రభుత్వానికి ఇది అసాధ్యం. ఒకవేళ అలా చేస్తే.. మార్కెట్లో వస్తు, సేవలకు డిమాండ్ పడిపోయి పన్ను ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. లేకపోతే వస్తు, సేవల కోసం ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఖర్చుచేసే సామాన్య మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలపై విపరీతమైన భారం పడుతుంది.

 ఐటీ స్థానే సీటీ అమలుతో పెరుగనున్న అంతరాలు

ఐటీ స్థానే సీటీ అమలుతో పెరుగనున్న అంతరాలు

దేశ ఆదాయంలో సగానికిపైగా మొత్తం సంపన్నులైన 10 శాతం మంది భారతీయులు చెల్లించే పన్నుల ద్వారానే వస్తున్నట్లు వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కనుక వినియోగ పన్నును ప్రవేశపెట్టడం ద్వారా సంపన్నులకు మరింత పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పించడమంటే వారి ఆదాయంలో అత్యధిక మొత్తానికి పన్ను విధించకుండా దేశ ఆదాయం భారీగా తగ్గించుకోవడమే అవుతుంది. దీనికి భిన్నంగా ప్రస్తుతం ఆదాయం పన్ను రూపేణా సంపన్నుల ఆదాయంలో చాలా మొత్తానికి ప్రభుత్వం పన్ను విధిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఒకే కలం పోటుతో ఆదాయం పన్నును పూర్తిగా రద్దుచేస్తే దేశంలో ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్న ఆర్థిక అసమానతలు మరింత తారాస్థాయికి చేరడం ఖాయమని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. వినియోగ పన్ను (సీటీ) వల్ల వస్తువులపై పన్ను భారం తగ్గుముఖం పడుతుందన్న వాదన కూడా పూర్తిగా తిరోగమన వైఖరితో కూడుకున్నదేనని చెబుతున్నారు.

 విలాస వస్తువుల కొనుగోళ్లు నివేదిస్తున్నారా?

విలాస వస్తువుల కొనుగోళ్లు నివేదిస్తున్నారా?

సంపన్నులు వాడే వస్తువులు, పేదల వాడే వస్తువులపై వస్తు సేవల పన్నుప్రభావం విభిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు సంపన్నులు వాడే విలాసవంతమైన కార్లపై అత్యధికంగా వసూలయ్యే పన్ను కంటే ఉప్పు, బ్రెడ్, పాల ఉత్పత్తులపై విధించే పన్ను చాలా తక్కువ అనే వాదన వినిపిస్తున్నది. అత్యంత ఖరీదైన చీరలు, ఆభరణాలు, ఉన్నతస్థాయి వర్గాలు వాడే ఫర్నీచర్ కొనుగోళ్ల రశీదుల్లో ‘మాయ'లు చేయకుండా ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పన్ను ఎగవేతకు పాల్పడేందుకు చౌక రకం కొనుగోళ్ల పేరిట రశీదు తీసుకునే దాఖలాలే ఎక్కువ అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), వినియోగ పన్ను (సీటీ) వసూళ్లు అసంఘటిత, సాధారణ పౌరుల నుంచే ప్రారంభం అవుతాయి. సంఘటిత రంగ వర్గాలు ‘ఇన్ వాయిస్' రశీదుల్లో మార్పులు చేసి ‘సీటీ' చెల్లింపులు తగ్గించుకునేందుకు.. వీలైతే ఎగవేతకు పాల్పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

 ఇన్ వాయిస్ ల్లో తేడాలే నల్లధనానికి మార్గాలు

ఇన్ వాయిస్ ల్లో తేడాలే నల్లధనానికి మార్గాలు

నల్లధనం దాచిపెట్టుకునేందుకు ఐటీ ఎగవేస్తున్నారన్న ప్రచారం సరి కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఉదాహరణకు చట్ట విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలు, గోల్డ్ అండ్ జ్యువెల్లరీ ఆభరణాల కొనుగోళ్లపై తక్కువ ధరకు ‘ఇన్ వాయిస్', రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వానికి నివేదించని లావాదేవీలు, బినామీ లావాదేవీల సంగతి విస్మరించి.. ఐటీ చెల్లింపుపై ప్రజలు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం సరి కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఆదాయం పన్ను చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం అంటే అగ్రశ్రేణి ఆదాయ సంపాదనాపరులు తమ ఆదాయాన్ని చట్ట విరుద్ధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించడమే అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 వార్షిక ఆస్తి పన్ను ద్వారా ఇలా పారదర్శకత

వార్షిక ఆస్తి పన్ను ద్వారా ఇలా పారదర్శకత

రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ప్లాట్లు, ఇళ్ల క్రయ, విక్రయదారులు కుమ్మక్కై స్టాంప్ డ్యూటీ తదితర పన్నుల చెల్లింపును తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారన్న విమర్శ ఉంది. ఒకవేళ రూ.10 కోట్ల విలువైన ఆస్తి కొనుగోలు చేసినా దాని విలువ రూ.5 కోట్లు అని మాత్రమే అధికారికంగా ధ్రువీకరిస్తారు. దీనివల్ల కేవలం రూ.40 లక్షల స్టాంప్ డ్యూటీ మాత్రమే చెల్లిస్తారు. వాస్తవంగా అయితే రూ.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి అసలు విలువ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ స్థానే వార్షిక పన్ను విధానం అమలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. నిజమైన ఆస్తి యజమాని దాదాపుగా వాస్తవిక అంచనాలు వెల్లడించే అవకాశాలే ఎక్కువ. అప్పుడు ఆస్తి అసలు విలువ నివేదించడం వల్ల పన్ను ఎగవేతకు పాల్పడే అవకాశాలే ఉండవు. తద్వారా నల్లధనం సమకూరే మార్గాలే ఉండవని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

 వెల్త్ టాక్స్ వసూళ్లతో రూ.3.25 లక్షల కోట్ల ఆదాయం

వెల్త్ టాక్స్ వసూళ్లతో రూ.3.25 లక్షల కోట్ల ఆదాయం

ఇదే పరిస్థితి వస్తువుల విక్రయదారులు తాము చెల్లించాల్సిన కేపిటల్ గూడ్స్ టాక్స్ ఎగవేసేందుకు తక్కువ స్టాక్ విక్రయించినట్లు పత్రాల్లో చేరుస్తారు. ఇటువంటి ప్రక్రియలే నల్లధనం తయారీకి మార్గాలుగా మారుతున్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రెడిట్ సూయిజ్ సంస్థ నివేదిక ప్రకారం 68 శాతం దేశీయ సంపద అంతా ఐదు శాతం మంది సంపన్నుల వద్దే పోగుపడింది. ఆ సంపద ద్వారా వచ్చే ఆదాయం, దానిపై పన్ను 4:1 శాతంగా ఉంటుంది. ఒకవేళ సంపద పన్ను (వెల్త్ టాక్స్) విధిస్తే ఏటా ప్రభుత్వానికి రూ.3.25 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నది.

English summary
Several people have advocated the abolition of income tax (I-T) in favour of a consumption tax (CT). They argue that this would, at one stroke, eradicate both tax evasion and black money, expand the tax base and ease fiscal constraints for GoI and the states. Such beliefs are far removed from reality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X